Naga Chaitanya: శ‌ర‌వేగంగా తండేల్ సినిమా షూటింగ్‌.. కీలక సన్నివేశాల చిత్రీక‌ర‌ణ‌

  • Written By:
  • Publish Date - June 8, 2024 / 10:10 PM IST

Naga Chaitanya: నాగచైతన్య ఈ మధ్య కాలంలో ఎన్నో ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం దర్శకుడు చందు మొండేటితో తండేల్ సినిమా చేస్తున్నాడు. అనుకోకుండా పాక్ జలాల్లోకి ప్రవేశించి దాదాపు రెండేళ్లు జైలు జీవితం గడిపిన రాజు తిరిగి ఇండియాకు వచ్చిన కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తదుపరి షెడ్యూల్ జూన్ 10 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం కానుంది. ఆర్ ఎఫ్ సీలో కొన్ని రోజుల పాటు షూటింగ్ చేసిన తర్వాత కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు చిత్రబృందం శ్రీకాకుళం వెళ్లనుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే రెండు పాటల రీరికార్డింగ్ పూర్తి చేసుకుంది.

గతంలో శేఖర్ కమ్ముల లవ్ స్టోరీలో నాగచైతన్యతో స్క్రీన్ షేర్ చేసుకున్న సాయిపల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 20, 2024న ఈ ప్రేమకథను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.