Site icon HashtagU Telugu

Naga Chaitanya-Sobhita Dhulipala: శోభితతో నాగచైతన్య రెండో పెళ్లి, చక్కర్లు కొడుతున్న రూమర్స్!

Nagachaitanya

Nagachaitanya

టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య నటి శోభిత ధూళిపాళ్లతో నాగ చైతన్య డేటింగ్‌లో ఉన్నాడనే వార్త చాలా కాలంగా వైరల్‌గా మారింది. వీరిద్దరూ కలిసి ఉన్న పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు వీరి ప్రేమ వ్యవహారంపై జాతీయ మీడియా సంస్థలు కూడా పలు ఆసక్తికర కథనాలను పబ్లిష్ చేశాయి. త్వరలో వారిద్దరూ తమ సంబంధాన్ని అధికారికంగా వెల్లడిస్తారని తెలిపింది. వారిద్దరూ ఇప్పటికే రిలేషన్ షిప్ ప్రకటనపై తుది నిర్ణయానికి వచ్చారని అత్యంత సన్నిహితులు చర్చించుకుంటున్నారు.

నాగ చైతన్య ఓ వ్యాపారవేత్త కూతురిని రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను వారి సన్నిహిత వర్గాలు ఖండించాయి. నాగ చైతన్య సినిమా ఇండస్ట్రీకి చెందని వారిని పెళ్లి చేసుకోవడం లేదు. నాగ చైతన్య ఇంకా శోభితతో డేటింగ్ చేస్తున్నాడు. వారి బంధం మరింత బలపడుతోంది.

త్వరలో తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించాలని వారు చర్చించుకున్నారు. తమ ప్రేమ వ్యవహారాన్ని బహిరంగంగా ఒప్పుకోవడానికి వాళ్లు ఏమాత్రం వెనుకాడరు’ అని సన్నిహిత వర్గాల సమాచారం. కాగా నాగ చైతన్య, శోభిత ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాతో పాటు టాలీవుడ్ సర్కిల్ లో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే నాగచైతన్య ఎప్పుడైతే సమంత నుంచి విడాకులు తీసుకున్నాడో, ఆరోజు నుంచి సోషల్ మీడియాలో అతనిపై పెళ్లి వార్తలపై గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి.

Also Read: KTR: ఎన్నో త్యాగాలతోనే తెలంగాణ ఏర్పడింది: మంత్రి కేటీఆర్