Site icon HashtagU Telugu

Naga Chaitanya – Bujji : ప్రభాస్ బుజ్జితో నాగచైతన్య సూపర్ ఫాస్ట్ డ్రైవింగ్.. వీడియో వైరల్

Naga Chaitanya With Prabhas Kalki 2898 Ad Bujji Car Video Gone Viral

Naga Chaitanya With Prabhas Kalki 2898 Ad Bujji Car Video Gone Viral

Naga Chaitanya – Bujji : ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాదు.. కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ లో కూడా ప్రభాస్ ‘బుజ్జి’ హాట్ టాపిక్ అయ్యింది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ‘కల్కి 2898 ఏడి’ సినిమాలో ప్రభాస్ తో పాటు బుజ్జి అనే రోబోటిక్ కారు కూడా ప్రధాన పాత్ర పోషించబోతుంది. దీంతో మేకర్స్ ఈ పాత్రని.. ఆడియన్స్ కి చాలా గ్రాండ్ గా పరిచయం చేసారు. కాగా ఆ కారుని దాదాపు రూ.8.5 కోట్ల ఖర్చుతో డిజైన్ చేసి రూపొందించారు. కేవలం రీల్ స్టోరీ కోసం రియల్ గా ఓ కారుని రూపొందించడం ఒక ఆకర్షణ అయితే.. దాని డిజైన్ ప్రతి ఒక్కర్ని ఆకట్టుకోవడం మరో స్పెషల్ అట్రాక్షన్.

ముఖ్యంగా కారు లవర్స్ ని అయితే బుజ్జి ప్రేమలో పడేస్తుంది. టాలీవుడ్ యువ సామ్రాట్ నాగచైతన్యకి కార్లు అన్న, కారు రేసింగ్స్ అన్న చాలా ఇష్టమని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఆ మధ్య హైదరాబాద్ లో జరిగిన మోటో రేసర్స్ కి కూడా చైతన్య బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరించారు. మరి కార్లు అంటే అంత పిచ్చి ఉన్న నాగచైతన్య.. బుజ్జి పై మనసు పారేసుకోకుండా ఉంటారా ఏంటి.

దీంతో ప్రత్యేక సమయం తీసుకోని మరి బుజ్జిని చూడడానికి కల్కి టీం వద్దకి వచ్చేసారు. అంతేకాదు, బుజ్జితో కలిసి ఒక సూపర్ ఫాస్ట్ రైడ్ కి కూడా వెళ్లారు. ఇక అందుకు సంబంధించిన చిన్న వీడియో ప్రోమోని కల్కి మేకర్స్ నెట్టింట షేర్ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ చిన్న వీడియో చూసిన చైతన్య ఫ్యాన్స్.. ఫుల్ రేస్ వీడియో షేర్ చేయండి ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ లు పెడుతున్నారు.