Site icon HashtagU Telugu

Naga Chaitanya: నాగ చైతన్య ద్విభాషా చిత్రం షురూ!

Nagachaitanya

Nagachaitanya

మజిలీ, వెంకీ మామ, లవ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్‌హిట్‌ లను అందుకున్న‌ నాగ చైతన్య ‘థాంక్యూ’ చిత్రం విడుదల కు సిద్ధం గా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందనున్న తన 22వ చిత్రం తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నారు. నావెల్ కంటెంట్‌తోపాటు స‌క్సెస్ ఫుల్ చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన వెంక‌ట్ ప్ర‌భు త‌న `మానాడు` చిత్రం తో బ్లాక్‌ బస్టర్‌ ను అందుకున్నారు.

రామ్ నటిస్తున్న `వారియర్` మరియు బోయపాటి శ్రీను- రామ్ కాంబినేష‌న్‌ చిత్రంతో సహా కొన్ని సెన్సేష‌న‌ల్ ప్రాజెక్ట్‌ లను చేయ‌బోతున్న ప్ర‌ముఖ నిర్మాణ‌ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యాన‌ర్‌ లో నాగ చైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో కొత్త చిత్రాన్ని ప్రకటించింది. ప‌వన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్నారు. తెలుగు, త‌మిళ భాషల్లో ఏకాకాలంలో రూపొంద‌బోతున్న ఈ చిత్రాన్ని హైటెక్నిక‌ల్ స్టాండర్డ్స్ తో భారీ బడ్జెట్ లో నిర్మించనున్నారు. కమర్షియల్ ఎంటర్‌టైనర్ గా రూపొందించ‌నున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు, మ‌రియు అనుభ‌జ్ఞులైన‌ సాంకేతిక నిపుణులు ప‌ని చేయనున్నారు. సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Exit mobile version