Site icon HashtagU Telugu

Rashmika : రష్మిక కు అండగా నిలబడ్డ చైతు..

Chaitu Rashmiak

Chaitu Rashmiak

మూడు రోజులుగా రష్మిక (Rashmika ) డీప్ క్లివేజ్ ఫేక్ వీడియో (Deepfake Video) సోషల్ మీడియా లో ఎంత వైరల్ గా మారిందో తెలియంది కాదు. ఈ వీడియో ఫై యావత్ సినీ అభిమానులే కాదు సినీ , రాజకీయ ప్రముఖులు సైతం షాక్ అయ్యారు. నిజంగా రష్మిక లాగే ఉండడంతో మరింత వైరల్ గా మారింది. ఈ వీడియోపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్రిటీష్ ఇండియన్, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ జరా పటేల్ (Zara Patel) కు చెందిన ఒరిజినల్ వీడియోను రష్మిక ముఖంతో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. అమితాబ్ బచ్చన్ సహా పలువురు సెలబ్రిటీలు ఈ చర్యను తప్పుపట్టారు. రాజకీయ నాయకులు సైతం దీనిపై స్పందించడం గమనార్హం. తాజాగా ఈ అంశంపై టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య (Naga chaitanya ) స్పందించాడు.

We’re now on WhatsApp. Click to Join.

‘టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేయడం చూస్తుంటే బాధగా ఉంది.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఊహించుకుంటేనే భయమేస్తుంది. బాధితుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాటిపై కొత్త చట్టాలు అమలు చేయాలి. మీకు మరింత ధైర్యం, బలం చేకూరాలి’ అంటూ రష్మిక చేసిన ట్వీట్‌కు ఆయన ట్యాగ్‌ చేశారు.

తనకు మద్దతుగా నిలిచిన చైతూకి రష్మిక కృతజ్ఞతలు తెలిపింది రష్మిక. ఇలాంటి మార్ఫింగ్‌ వీడియోల వల్ల సమాజంలో ఎంతో మంది అమ్మాయిలు ఇబ్బందలకు గురౌతున్నారు. ఇది చాలా భయానకమైన చర్య అంటూ తెలిపిన రష్మిక.. తనకు సపోర్ట్‌గా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తోంది.

Read Also : PM Modi: హైదరాబాద్ కు మోడీ రాక, నేడు సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు