Site icon HashtagU Telugu

Naga Chaitanya : అక్కినేని ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్న తండేల్ వర్కింగ్ స్టిల్స్..!

Nani Paradise two Parts planning

Nani Paradise two Parts planning

Naga Chaitanya యువ సామ్రాట్ నాగ చైతన్య ప్రస్తుతం చందు మొండేటి డైరెక్షన్ లో తండేల్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో రూపొందించే ఈ సినిమాలో నాగ చైతన్య ఫిషర్ మెన్ గా కనిపించనున్నారు. ఆమధ్య వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా సినిమాతో నాగ చైతన్య డిఫరెంట్ ఇమేజ్ తెచ్చుకోవడం పక్కా అని అంటున్నారు.

ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా నుంచి లేటెస్ట్ గా వర్కింగ్ స్టిల్స్ కొన్ని రిలీజ్ చేశారు. డీ గ్లామర్ లుక్ లో నాగ చైతన్య, సాయి పల్లవి కచ్చితంగా ఆడియన్స్ మనసులు దోచేసేలా ఉన్నాయి.

dd

అక్కినేని ఫ్యాన్స్ అంతా కూడా తండేల్ వర్కింగ్ స్టిల్స్ చూసి ఖుషి అవుతున్నారు. చందు మొండేటి ఆల్రెడీ కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ అందుకోగా మరోసారి అలాంటి బ్లాక్ బస్టర్ కి గురి పెట్టాడు.

నాగ చైతన్యతో సాయి పల్లవి ఆల్రెడీ లవ్ స్టోరీ సినిమాలో నటించింది. ఆ సినిమా హిట్ సెంటిమెంట్ ని రిపీట్ చేయాలని చూస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న తండేల్ సినిమా విషయంలో మేకర్స్ ప్లానింగ్ అంతా కూడా భారీగా ఉన్నట్టు తెలుస్తుంది. మరి తండేల్ సినిమా అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.