Site icon HashtagU Telugu

Naga Chaitanya Thandel : నాగ చైతన్య తండేల్ రిలీజ్ అప్పుడేనా..?

AP Government Price hike for Naga Chatainya Thandel Movie

AP Government Price hike for Naga Chatainya Thandel Movie

అక్కినేని హీరో నాగ చైతన్య (Naga Chaitanya) ప్రస్తుతం చందు మొండేటి డైరెక్షన్ లో తండేల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. సినిమాలో చైతన్య సరసన సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్ గా నటిస్తుంది. తండేల్ వెరైటీ కథతో పాన్ ఇండియా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే రిలీజైన టీజర్ తో పాజిటివ్ బజ్ ఏర్పడింది.

అసలైతే ఈ సినిమాను క్రిస్ మస్ కానుకగా డిసెంబర్ 22న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఆ టైం కు గేమ్ చేంజర్ వస్తున్న కారణంగా వాయిదా వేశారు. ఐతే ఇప్పుడు గేమ్ చేంజర్ (Game Changer) క్రిస్ మస్ రేసు నుంచి తప్పుకుంది. మరి అనుకున్న విధంగా తండేల్ (Thandel) క్రిస్ మస్ కు వస్తుందా అంటే కష్టమే అంటున్నారు. సినిమాను ముందు డిసెంబర్ రిలీజ్ టార్గెట్ తో మొదలు పెట్టినా సినిమా ఇంకా షూట్ చేయాల్సింది చాలా ఉందట.

తండేల్ రిలీజ్ పై క్లారిటీ..

అంతేకాదు వి.ఎఫ్.ఎక్స్ వర్క్ విషయంలో కూడా లేట్ అవుతున్నట్టు తెలుస్తుంది. అందుకే తండేల్ రిలీజ్ పై క్లారిటీ రావట్లేదు. ఐతే తెలుస్తున్న సమాచారం ప్రకారం తండేల్ ని 2025 జనవరి మంత్ ఎండ్ అంటే రిపబ్లిక్ వీకెండ్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. సో అలా చేస్తే సంక్రాంతి సినిమాలకు కూడా ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది.

మరి నిజంగానే తండేల్ రిపబ్లిక్ డే కానుకగా రిలీజ్ చేస్తారా లేదా అంతకుముందే వస్తుందా అన్నది చూడాలి. సంక్రాంతికి రావాల్సిన విశ్వంభర సినిమా మార్చి కి మార్చారు. మరి సినిమాల రిలీజ్ డేట్ పై క్లారిటీ ఎప్పుడొస్తుందో చూడాలి.