Naga Chaitanya: నాగ చైతన్య తండేల్ రిలీజ్ తేదీ ఎప్పడు?

క్రేజీ కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్‌గా రూపుదిద్దుకుంటున్నది తండేల్. లవ్ స్టోరీ తర్వాత సాయి పల్లవి, నాగ చైతన్య నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Naga Chaitanya: క్రేజీ కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్‌గా రూపుదిద్దుకుంటున్నది తండేల్. లవ్ స్టోరీ తర్వాత సాయి పల్లవి, నాగ చైతన్య నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

చందు మొండేటి తెరకెక్కిస్తోన్న తండేల్ గీతా ఆర్ట్స్ బ్యానర్ అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. చైతన్య, సాయిపల్లవి వీరిద్దరూ కలిసి నటించిన లవ్ స్టోరీ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు మరోసారి కలిసి నటిస్తుండడంతో తండేల్ మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల ఈ మూవీ సెట్స్ పైకి వచ్చింది. అలాగే ఈమధ్య రిలీజ్ చేసిన తండేల్ గ్లింప్స్ సినిమా పై మరింత ఆసక్తిని పెంచేసింది.

అయితే.. తండేల్ ఎప్పటికి షూటింగ్ కంప్లీట్ అవుతుంది..? అసలు రిలీజ్ ఎప్పుడు..? అంటే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కంటిన్యూగా షూటింగ్ చేస్తున్నారు. సమ్మర్ కి ఈ సినిమా కంప్లీట్ చేయాలి అనేది మేకర్స్ ప్లాన్. పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ టైమ్ తీసుకుని సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. కొన్ని యద్ధార్థ సంఘటనలు ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా కథ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. శ్రీకాకుళం వెళ్లి కథ గురించి మరింతగా తెలసుకుని ఆ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేశారు.

ఇందులో చైతన్య మత్సకారుడుగా నటిస్తుండడం.. లుక్ మాస్ గా ఉండడంతో ఇది కొత్త చైతన్యను పరిచయం చేస్తుందనే టాక్ బలంగా ఉంది. దీనికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆలెడ్రీ సాంగ్స్ రికార్డ్ చేయడం కూడా జరిగిందట. చైతన్య మార్కెట్ కు మించి ఖర్చు పెట్టి మరీ ఈ సినిమాను తీస్తున్నారు. ఈ సినిమా కోసం చైతన్య చాలా హార్డ్ వర్క్ చేశాడు. ముఖ్యంగా కథను బలంగా నమ్మాడు. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది త్వరలోనే మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారట.ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరి తండేల్‌తో నాగ చైతన్య పాన్ ఇండియా హిట్ కొడతాడేమో చూడాలి.

Also Read: Samsung Galaxy f54 5g Price : రూ. 5 వేల తగ్గింపుతో తక్కువ ధరకే శాంసంగ్ స్మార్ట్ ఫోన్ ని సొంతం చేసుకోండిలా?