అక్కినేని హీరో నాగ చైతన్య (Naga Chaitanya) చందు మొండేటి కాంబోలో వస్తున్న సినిమా తండేల్. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి (Sai Pallavi) నటిస్తుంది. నాగ చైతన్య తండేల్ నుంచి వచ్చిన టీజర్ సినిమాపై ఆసక్తి పెంచింది.
ఈ సినిమాను అసలైతే డిసెంబర్ 23న క్రిస్ మస్ కానుకగా రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఆ టైం కు రాం చరణ్ గేమ్ చేంజర్ (Game Changer) వస్తుందని వాయిదా వేశారు. ఐతే ఇప్పుడు గేమ్ చేంజర్ సంక్రాంతికి కన్ఫర్మ్ అయ్యింది.
సంక్రాంతికి తీసుకు రావాలనే..
అఫీషియల్ గా పోస్టర్ వేయడం ఒక్కటే ఉంది. ఐతే చైతు సినిమాను ముందు అనుకున్నట్టుగా క్రిస్మస్ కి తీసుకొచ్చే అవకాశం ఉంది. కానీ తండేల్ (Thandel) సినిమాను కూడా సంక్రాంతికి తీసుకు రావాలనే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే సంక్రాంతికి రావాల్సిన వెంకటేష్ సినిమా సమ్మర్ కి వాయిదా వేస్తున్నారని తెలుస్తుంది. చరణ్ వస్తున్నాడని తెలిసి చిరు విశ్వంభర కూడా వాయిదా వేసుకున్నారు.
ఇప్పుడు చైతన్య తండేల్ రేసులో ఉంటున్నాడని తెలుస్తుంది. డిసెంబర్ 6న పుష్ప 2 వస్తే డిసెంబర్ చివరి వారలో సినిమా రిలీజ్ చేస్తే బాగానే ఉంటుంది. కానీ ఎందుకో మేకర్స్ క్రిస్ మస్ ని స్కిప్ చేయాలని చూస్తున్నారు. మరోపక్క బాలకృష్ణ 109వ సినిమా సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు. సో చరణ్, బాలకృష్ణ తో పాటు చైతన్య కూడా సంక్రాంతి రేసులో ఉంటాడా లేదా అన్నది చూడాలి.
Also Read : Anchor Pradeep Machiraju: పవర్ స్టార్ టైటిల్‌తో యాంకర్ ప్రదీప్ కొత్త సినిమా