యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా చందు మొండేటి డైరెక్షన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా తండేల్. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నాగ చైతన్య కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తండేల్ సినిమా విషయంలో ప్రతీదీ చాలా భారీగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సినిమాలో ఒక సాంగ్ కోసం ఏకంగా పెద్ద స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది.
అంతేకాదు 90 మంది కళాకారులు 200 మంది డాన్సర్స్ తో ఈ సాంగ్ షూట్ చేస్తున్నారట. సినిమాలో హైలెట్ గా చెప్పుకునే వాటిలో ఈ సాంగ్ కూడా ఒకటని టాక్. కార్తికేయ 2 తర్వాత చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా విషయంలో మేకర్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.
నాగ చైతన్య (Naga Chaitanya), సాయి పల్లవి ఇద్దరిది హిట్ పెయిర్.. లవ్ స్టోరీతో ఈ జోడీ సూపర్ హిట్ అందుకోగా ఈసారి తండేల్ (Thandel)తో పాన్ ఇండియా లెవెల్ లో భారీ హిట్ కోసం చూస్తున్నారు. తండేల్ సినిమా మీద నాగ చైతన్య ఫుల్ ఎఫర్ట్ పెట్టేస్తున్నారని తెలుస్తుంది. తండేల్ సెట్స్ మీద ఉన్నప్పుడే మంచి బిజినెస్ జరుగుతుంది. సినిమాపై మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
తండేల్ ను ముందు డిసెంబర్ ఎండింగ్ అదే క్రిస్ మస్ కానుకగా రిలీజ్ చేయాలని అనుకోగా ఇప్పుడు అది మిస్ అయ్యేలా ఉంది. 2025 సమ్మర్ కి తండేల్ రిలీజ్ వాయిదా వేస్తున్నారని టాక్.
Also Read : Raviteja Mr Bacchan : మిస్టర్ బచ్చన్ ఓటీటీ లోకి వచ్చేస్తుందా..?