Site icon HashtagU Telugu

Naga Chaitanya Thandel : నాగ చైతన్య తండేల్.. టైటిల్ వెనక రీజన్ అదేనా..!

Naga Chaitanya Thandel Here Is The Real Meaning (1)

Naga Chaitanya Thandel Here Is The Real Meaning (1)

Naga Chaitanya Thandel నాగ చైతన్య చందు మొండేటి కాంబోలో వస్తున్న 3వ సినిమాకు తండేల్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య ఫిషర్ మెన్ గా కనిపించనున్నారు. ఈ సినిమా కథ ప్రకారం తండేల్ అనే టైటిల్ పర్ఫెక్ట్ అని మేకర్స్ ఫిక్స్ చేశారు. టైటిల్ బాగున్నా దాని అర్ధం ఏంటో తెలియక సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు ఆడియన్స్.

తీర ప్రాంతంలో ఉన్న వారికి తండేల్ అర్ధం తెలుసు. తండేల్ అంటే నాయకుడు, లీడర్ అనే అర్ధం వస్తుందని అంటునారు. కండలు తిరిగిన దేహం, మెడలో దుర్గమ్మ తో నాగ చైతన్య లుక్ మాత్రం అదిరిపోయింది. ఈ సినిమా కథ మొత్తం తీర ప్రాంతంలోనే జరుగుతుందని తెలుస్తుంది.

సినిమా కోసం నాగ చైతన్య చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాదు పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. కార్తికేయ 2 తర్వాత చందు చేస్తున్న ఈ ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Also Read : Animal Trailer : యానిమల్ ట్రైలర్.. ఇది సందీప్ మార్క్ విధ్వంసం..!

We’re now on WhatsApp : Click to Join