Naga Chaitanya Thandel : నాగ చైతన్య తండేల్ దూకుడు.. అక్కినేని ఫ్యాన్స్ కి సూపర్ అప్డేట్..!

Naga Chaitanya Thandel అక్కినేని హీరోల్లో హిట్లు ఫ్లాపులను సమతూకంగా వేసుకుంటూ వెళ్తున్న నాగ చైతన్య కెరీర్ లో ఫస్ట్ టైం భారీ సినిమా చేస్తున్నాడు. చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న

Published By: HashtagU Telugu Desk
AP Government Price hike for Naga Chatainya Thandel Movie

AP Government Price hike for Naga Chatainya Thandel Movie

Naga Chaitanya Thandel అక్కినేని హీరోల్లో హిట్లు ఫ్లాపులను సమతూకంగా వేసుకుంటూ వెళ్తున్న నాగ చైతన్య కెరీర్ లో ఫస్ట్ టైం భారీ సినిమా చేస్తున్నాడు. చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తండేల్ టైటిల్ అని ఫిక్స్ చేశారు. గీతా ఆర్ట్స్ 2 లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కోసమే చిత్ర యూనిట్ అంతా కూడా వర్క్ చేశారు. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే భారీ హైప్ ఏర్పరచుకుంది. నాగ చైతన్య తండేల్ సినిమాకు సంబందించి ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. లాంగ్ షెడ్యూల్ గా మొదలు పెట్టిన ఈ పార్ట్ ని అనుకున్న దానికన్నా ఎంతో ఎక్కువ ఇంపాక్ట్ తో తెరకెక్కించారట.

ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ అవుట్ మీద చాలా సంతృప్తి కరంగా ఉన్నట్టు తెలుస్తుంది. నాగ చైతన్య కెరీర్ లో డిఫరెంట్ అటెంప్ట్ గా వస్తున్న తండేల్ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ గా వచ్చిన టీజర్ అంచనాలు పెంచింది. ఈ సినిమాలో నాగ చైతన్య విశ్వరూపం చూపిస్తాడని అంటున్నారు. సినిమాలో సాయి పల్లవి పాత్రకు కూడా చాలా సర్ ప్రైజింగ్ గా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాను 2025 సన్ర్కాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

Also Read : Rajamouli : మహేష్ సినిమా కోసం మొత్తం మార్చేస్తున్న రాజమౌళి.. ఎందుకని ఈ భారీ మార్పులు..?

  Last Updated: 06 Feb 2024, 09:38 AM IST