యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య లీడ్ రోల్ లో చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా తండేల్. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా నుంచి వచ్చిన బుజ్జి తల్లి సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. సినిమాలోని ఈ సాంగ్ చార్ట్ బస్టర్ గా మారింది. దేవి మ్యూజిక్ మరోసారి అద్భుతాలు సృష్టించేలా ఉంది.
తండేల్ (Thandel) బుజ్జి తల్లి సాంగ్ శ్రోతలను ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ రాబడుతుంది. ఇప్పటికే సినిమా 25 మిలియన్ల వ్యూస్ తో అదరగొడుతుంది. రిలీజ్ ముందే బుజ్జి తల్లి సాంగ్ (Bujji Thalli Song) తో తండేల్ సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడింది. ఇక సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి జోడీ సినిమాకే హైలెట్ గా నిలిచేలా ఉంది.
నాగ చైతన్య (Naga Chaitanya,) కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో తండేల్ వస్తుంది. బుజ్జి తల్లి సాంగ్ ఇచ్చిన బూస్టింగ్ కి సినిమాలో అన్ని సాంగ్స్ ని సంథింగ్ స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నారట. అసలైతే డిసెంబర్ రేసులో దిగాల్సిన తండేల్ సినిమా ఫిబ్రవరికి వాయిదా వేశారు. తండేల్ సినిమా మీద ఆడియన్స్ అంతా చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ముఖ్యంగా అక్కినేని ఫ్యాన్స్ అయితే సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఊపు చూపిస్తున్నారు. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.
Also Read : Warning To Manchu Vishnu: మంచు విష్ణుకు వార్నింగ్ ఇచ్చిన రాచకొండ సీపీ!