అక్కినేని నాగ చైతన్య శోభిత ఈమధ్యనే ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. వారి పెళ్లి ముహుర్తం ఎప్పుడు అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 4న నాగ చైతన్య, శోభిత పెళ్లి అని వార్తలు వచ్చినా పెళ్లి కార్డ్ వస్తేనే కానీ ఆ వార్తల్లో నిజం ఎంత అన్నది తెలుస్తుందని అనుకున్నారు. ఐతే లేటెస్ట్ గా చైతన్య, శోభిత పెళ్లి కార్డ్ కూడా వచ్చేసింది.
ముందు నుంచి చెబుతున్నట్టుగానే చైతన్య, శోభితల పెళ్లి డిసెంబర్ 4న ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ పెళ్లి కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగ చైతన్య శోభిత పెళ్లి ముహుర్తం ఎప్పుడన్నది కార్డ్ లో మెన్షన్ చేయలేదు.
పెళ్లి వేడుక హైదరాబాద్ లోనే..
ఈ పెళ్లి వేడుక హైదరాబాద్ లోనే జరగనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే శోభిత ఇంట్లో పెళ్లికి సంబందించిన పనులు మొదలయ్యాయి. ఈమధ్యనే చైతన్య, శోభిత అలా విహార యాత్రకు వెళ్లొచ్చారు. ఓ పక్క సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా నాగ చైతన్య పెళ్లికి అనుగుణంగా తన డేట్స్ ఖాళీ చేసుకున్నాడు.
ప్రస్తుతం చైతన్య తండేల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను చందు మొండేటి డైరెక్ట్ చేస్తుండగా సాయి పల్లవి ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న తండేల్ సినిమా ఫిషర్ మెన్ నేపథ్యంతో తెరకెక్కుతుంది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ ప్లాన్ చేశారు. అసలైతే సినిమా డిసెంబర్ లో రిలీజ్ అవ్వాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఫిబ్రవరికి వాయిదా వేశారు.
Also Read : Devi Sri Prasad : దేవి మీద సూర్య ఫ్యాన్స్ ఆగ్రహం రీజన్ ఏంటంటే..!