Naga Chaitanya : హిట్ ఇచ్చిన డైరెక్టర్ కి నాగ చైతన్య నో ఎందుకు చెప్పాడు..?

Naga Chaitanya అక్కినేని హీరో నాగ చైతన్య ఒక హిట్టు రెండు ఫ్లాపులు అన్న విధంగా కెరీర్ కొనసాగిస్తున్నాడు. అంతకుముందు కన్నీ మజిలీ నుంచి నాగ చైతన్య మంచి పర్ఫార్మెన్స్ తో అలరిస్తున్నాడు. లవ్ స్టోరీ తర్వాత మళ్లీ నాగ చైతన్యకు

Published By: HashtagU Telugu Desk
Is Naga Chaitanya Engagement with Heroine Today?

Is Naga Chaitanya Engagement with Heroine Today?

Naga Chaitanya అక్కినేని హీరో నాగ చైతన్య ఒక హిట్టు రెండు ఫ్లాపులు అన్న విధంగా కెరీర్ కొనసాగిస్తున్నాడు. అంతకుముందు కన్నీ మజిలీ నుంచి నాగ చైతన్య మంచి పర్ఫార్మెన్స్ తో అలరిస్తున్నాడు. లవ్ స్టోరీ తర్వాత మళ్లీ నాగ చైతన్యకు బ్యాడ్ టైం నడుస్తుంది. థాంక్యు, కస్టడీ సినిమాలు రెండు నిరాశపరచాయి. అందుకే కొద్దిగా గ్యాప్ తీసుకుని తండేల్ అంటూ ఒక క్రేజీ ప్రాజెక్ట్ తో రాబోతున్నాడు. తండేల్ సినిమా ను చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్నాడు.

ఈ సినిమాలో నాగ చైతన్యకు జోడీగా సాయి పల్లవి నటిస్తుంది. లవ్ స్టోరీ తో జత కట్టిన ఈ ఇద్దరు మళ్లీ కలిసి సినిమా చేయడం ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచింది. అయితే నాగ చైతన్యతో సినిమా చేయాలని కొందరు దర్శకులు ప్రయత్నిస్తున్నా చైతన్య మాత్రం ఆచితూచి అడుగులేస్తున్నాడని తెలుస్తుంది.

ముఖ్యంగా తనకు ఒక హిట్ ఇచ్చిన డైరెక్టర్ ని కూడా నాగ చైతన్య పక్కన పెట్టేశాడని తెలుస్తుంది. నాగ చైతన్య హీరోగా వచ్చిన మజిలీ సినిమాను శివ నిర్వాణ డైరెక్ట్ చేశాడు. ఆ సినిమాలో నాగ చైతన్యను సీరియస్ మోడ్ లో చూపించి సక్సెస్ అయ్యాడు. ఆ సినిమాలో సమంత కూడా మేజర్ హెల్ప్ అయ్యింది.

ఇప్పుడు నాగ చైతన్యకు శివ నిర్వాణ ఒక కథ చెబితే అక్కినేని హీరో కాదనేశాడట. నానితో టక్ జగదీష్ తో నిరాశపరచిన శివ నిర్వాణ విజయ్ దేవరకొండ, సమంతతో కలిసి ఖుషి సినిమా చేశాడు. ఆ సినిమా జస్ట్ ఓకే అనిపించుకుంది. మరోసారి నాగ చైతన్యతో పనిచేయాలని అనుకోగా చైతన్య మాత్రం అతని డైరెక్షన్ లో చేసే ఆసక్తి చూపించట్లేదు. చైతన్య కాదనేసరికి తన నెక్స్ట్ హీరో వేటలో ఉన్నాడు శివ నిర్వాణ.

Also Read : Pandya Stepbrother: హార్దిక్ పాండ్యా సోద‌రుడు అరెస్ట్‌.. కార‌ణ‌మిదే..!

  Last Updated: 11 Apr 2024, 12:46 PM IST