Thandel : నాగ చైతన్య, సాయి పల్లవి ‘తండేల్’ ఓటీటీ రిలీజ్.. ఎప్పుడు? ఏ ఓటీటీలో తెలుసా..

థియేటర్స్ లో సూపర్ హిట్ అయిన తండేల్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.

Published By: HashtagU Telugu Desk
Naga Chaitanya Sai Pallavi Thandel Movie OTT Release Date announced

Thandel Ott

Thandel : నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన సినిమా తండేల్. అల్లు అరవింద్ సమర్పణలో గీత ఆర్ట్స్ నిర్మాణంలో బన్నీ వాసు నిర్మాతగా చందూ మొండేటి దర్శకత్వంలో చైతు కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమాగా తండేల్ తెరకెక్కింది. ఫిబ్రవరి 7న థియేటర్స్ లో రిలీజయిన తండేల్ సినిమా పెద్ద హిట్ అయి ఏకంగా 100 కోట్లు కలెక్ట్ చేసింది. చైతు కెరీర్ లోనే మొదటి 100 కోట్ల సినిమాగా నిలిచింది ఈ సినిమా.

థియేటర్స్ లో సూపర్ హిట్ అయిన తండేల్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. మార్చ్ 7 నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది. ఓటీటీలో ఏ రేంజ్ లో హిట్ అవుద్దో చూడాలి. థియేటర్స్ లో మిస్ అయితే ఓటీటీలో తండేల్ కచ్చితంగా చూడండి.

గతంలో శ్రీకాకుళంకు చెందిన కొంతమంది మత్స్యకారులు గుజరాత్ కు వేటకు వెళ్లి అక్కడ సముద్రంలో అనుకోకుండా పాకిస్థాన్ జలాల్లోకి వెళ్లి అరెస్ట్ అయి తిరిగి వచ్చిన కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఆ కథకు మత్స్యకారుల లీడర్, అతని ప్రేమ కథ కథాంశాన్ని జోడించి తండేల్ సినిమాని ప్రేమకథగా తెరకెక్కించారు.

 

Also Read : Venkaiah Naidu : విలన్లను హీరోలుగా చూపిస్తున్నారు.. ఇప్పటి సినిమాలపై వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు..

  Last Updated: 03 Mar 2025, 09:21 AM IST