అక్కినేని హీరో యువ సామ్రాట్ నాగ చైతన్య (Naga Chaitanya,) హీరోగా చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా తండేల్. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా లో చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన బుజ్జి తల్లి సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి రెండో సాంగ్ రిలీజైంది.
సినిమా నుంచి నమ శివాయ సాంగ్ రిలీజైంది. ఈ సాంగ్ విన్న ఆడియన్స్ సూపర్ అనేస్తున్నారు. ముఖ్యంగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కి సాయి పల్లవి డ్యాన్స్ మూమెంట్స్ అదిరిపోయాయి. సాయి పల్లవి (Sai Pallavi) ఎందుకంత స్పెషల్ అన్నది ఈ సాంగ్ చూస్తే అర్ధమవుతుంది. ముఖ్యంగా ఆమె స్టెప్స్ పోస్టర్స్ అన్నీ కూడా అదిరిపోయాయి.
తండేల్ సినిమా నుంచి రిలీజైన రెండు సాంగ్స్ కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాయి. ఈ సినిమాకు దేవి మ్యూజిక్ తో పాటు సాయి పల్లవి డ్యాన్స్ కూడా హైలెట్ గా నిలిచేలా ఉంది. తండేల్ సినిమాకు శివరాత్రి కానుకగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా పై నాగ చైతన్య సూపర్ కాన్ ఫిడెంట్ గా ఉన్నారు. మొత్తనికి తండేల్ కూడా క్రేజీ ప్రాజెక్ట్ గా ఆడియన్స్ అంతా కూడా ఆస్క్తిగా ఎదురుచూసేలా చేసుకుంది.