Naga Chaitanya : సాయి దుర్గ తేజ్, నాగచైతన్యతో కొత్త సినిమాటిక్ యూనివర్స్‌ని క్రియేట్ చేస్తున్నారా..?

దర్శకుడు కార్తీక్ దండు సాయి దుర్గ తేజ్, నాగచైతన్యతో కొత్త సినిమాటిక్ యూనివర్స్‌ని క్రియేట్ చేస్తున్నారా..?

Published By: HashtagU Telugu Desk
Naga Chaitanya Sai Durgha Tej Is Really Creating A New Cinematic Universe

Naga Chaitanya Sai Durgha Tej Is Really Creating A New Cinematic Universe

Naga Chaitanya : యువసామ్రాట్ నాగచైతన్య ప్రస్తుతం చందూ ముండేటి దర్శకత్వంలో ‘తండేల్’ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రం మిస్టిక్ థ్రిల్లర్ కథాంశంతో ఉండబోతుందట. దర్శకుడితో పాటు ‘విరూపాక్ష’కి పని చేసిన నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా నాగచైతన్య చిత్రానికి వర్క్ చేస్తున్నారు. ఇక విరూపాక్ష సినిమా కూడా మిస్టిక్ థ్రిల్లర్ నేపథ్యంతోనే ఆడియన్స్ ముందుకు వచ్చింది.

ఇప్పుడు నాగచైతన్య సినిమా కూడా అదే నేపథ్యంలో అని చెబుతున్నారు. ఇక ఈ కామన్ పాయింట్స్ ని గమనించిన నెటిజెన్స్.. దర్శకుడు కార్తీక్ దండు ఒక కొత్త సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేస్తున్నాడా..? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాటిక్ యూనివర్స్ ల ట్రెండ్ నడుస్తుంది. ఈ ట్రెండ్ ని ఫాలో అవుతూనే.. సాయి ధరమ్ తేజ్ అండ్ నాగచైతన్యని ఒక ఫ్రేమ్ లోకి తీసుకు రాబోతున్నారా..? అనే ప్రశ్నలు వేస్తున్నారు. మరి చైతన్యతో తీయబోయేది స్టాండ్ ఎలోన్ సినిమానా..? లేదా..? అనేది చూడాలి.

కాగా చైతన్య ఫ్యాన్స్ ఈ సినిమా పై మంచి అంచనాలే పెట్టుకున్నారు. ఎందుకంటే ఇటీవల నాగచైతన్య ఇటువంటి సబ్జెట్ తోనే ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్టుని సొంతం చేసుకున్నారు. ‘దూత’ మిస్టిక్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో నాగచైతన్య నటించి మెప్పించారు. ఈక్రమంలోనే కార్తీక్ దండు చేయబోయే సినిమాతో కూడా చైతన్య సూపర్ హిట్టుని అందుకుంటారని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. గతంలో ఒక ‘లైలా కోసం’ సినిమాలో చై అండ్ పూజా కలిసి నటించి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. బివిఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించనున్నారు. త్వరలోనే మూవీని లాంచ్ చేసి షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు.

Also read : Venkatesh : ఖమ్మం లో వెంకటేష్ ప్రచారం..ఫ్యామిలీ ఓట్లన్నీ ఆ అభ్యర్థికే అన్నమాట ..!!

  Last Updated: 30 Apr 2024, 04:46 PM IST