నాగచైతన్య-సమంత విడాకుల (Naga Chaitanya – Samantha Divorce)పై మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. చైతు -సమంతల విడాకులకు మాజీ మంత్రి కేటీఆర్ (KTR), నాగార్జునే (Nagarjuna) కారణమని ఆమె సంచలన ఆరోపణలు చేసింది. ఈ వ్యాఖ్యలు చేసిన దగ్గరి నుండి సోషల్ మీడియాలో కాంగ్రెస్-బీఆర్ఎస్ తో పాటు చైతూ, సామ్ ఫ్యాన్స్ మధ్య పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. సురేఖ వ్యాఖ్యలపై అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు బిఆర్ఎస్ కూడా ఈ ఆరోపణలను ఖండిస్తూ..సురేఖ క్షేమపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
సురేఖ వ్యాఖ్యలఫై నాగచైతన్య Xలో స్పందించారు. ఆయన ప్రత్యేకంగా ట్వీట్ చేయకపోయినా, తన తండ్రి నాగార్జున చేసిన ట్వీట్ నే రీట్వీట్ చేశారు. గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను’ అంటూ నాగార్జున తెలిపిన ట్వీట్ నే చైతు తెలిపాడు.
అటు సురేఖ కామెంట్స్ ఫై సమంత సైతం కాస్త ఘాటుగానే స్పందించారు. తనను రాజకీయాల్లోకి లాగొద్దని కోరారు. ‘మహిళల్ని వస్తువుల్లా చూసే ఈ గ్లామర్ పరిశ్రమలో పనిచేయడం, ప్రేమలో పడటం, నిలబడి పోరాడటానికి చాలా శక్తి కావాలి. నా ప్రయాణాన్ని చిన్నచూపు చూడొద్దు. ఇక విడాకులనేవి పూర్తిగా నా వ్యక్తిగత విషయం. అది ఇద్దరి అంగీకారంతో, ఎటువంటి రాజకీయ కుట్ర లేకుండా జరిగింది. దయచేసి నా పేరును రాజకీయాలకు దూరం పెట్టండి’ అని ఓ ప్రకటనలో సూచించారు.
మరోపక్క సురేఖ వ్యాఖ్యలను ఇండస్ట్రీ లోని పలువురు సైతం రియాక్ట్ అవుతున్నారు. కొందరు మైలేజ్ కోసం సమంత పేరును వాడుకుంటున్నారంటూ సమంత విడాకుల గురించి మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ ఫై సింగర్ చిన్మయి పరోక్షంగా స్పందించారు. సమంత విషయంలో యూట్యూబ్ ఛానళ్లు, మీడియా సంస్థల తీరునూ ఆమె తప్పుబట్టారు. వ్యూస్, లైక్స్, డబ్బు కోసం ఇలా చేయడం బాధాకరమన్నారు.
గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన…
— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 2, 2024
Read Also : Iran : ఇరాన్‌కు వెళ్లకండి.. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన