Site icon HashtagU Telugu

NC22 Poster: పోలీస్ గా నాగచైతన్య.. ఆసక్తిరేపుతున్న NC22 లుక్!

Nc22

Nc22

టాలీవుడ్ యంగ్ నాగ చైతన్య హీరోగా నటిస్తున్న NC22 మూవీ ఆసక్తి రేపుతోంది. ఈ మూవీ మేకర్స్ చిత్రం నుండి టీజర్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ మూవీలో నాగచైతన్య భివా అనే పోలీసు అధికారిగా కనిపించనున్నాడు. పోలీసుల బృందం హీరో చుట్టూ చేరి, అతని ముఖాన్ని కప్పి ఉంచి, గన్స్ తో గురి పెడుతుంది. ఈ లుక్ అక్కినేని అభిమాలను ఆకర్షిస్తోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ రేపు నవంబర్ 23న విడుదల కానున్నాయి. పోస్టర్‌ను షేర్ చేస్తూ, మేకర్స్ ట్వీట్ చేశారు. ” 𝐅𝐎𝐑𝐂𝐄 #NC22 ప్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ, రేపు ఉదయం 10:18 గంటలకు ఫస్ట్ లుక్ & టైటిల్‌ను ఆవిష్కరిస్తున్నాం” అంటూ పోస్ట్ చేశారు.

NC 22 చిత్రంలో వెన్నెల కిశోర్‌, ప్రేమ్‌గీ అమ‌రేన్‌, సంప‌త్ రాజ్, శరత్‌కుమార్‌, ప్రియమణి కీల‌క పాత్రల్లో నటిస్తున్నారు.ఇటీవలే హైదరాబాద్‌ లో ఎన్‌సీ 22 యాక్షన్‌ షెడ్యూల్ మొదలైంది. భారీ సెట్టులో యాక్షన్‌ షెడ్యూల్‌ కొనసాగుతున్నట్టు ఫిలింనగర్‌ సర్కిల్ టాక్‌. ఈ చిత్రంలో అరవింద్‌ స్వామి విలన్‌గా నటిస్తున్నాడు.

 

Exit mobile version