NC23 నాగ చైతన్య సినిమా వేరే లెవెల్ ప్లానింగ్..!

NC23 నాగ చైతన్య కస్టడీ రిజల్ట్ నిరాశపరచడంతో తను నెక్స్ట్ చేసే సినిమా టార్గెట్ అసలు మిస్ అవ్వకూడదని పర్ఫెక్ట్ ప్లానింగ్

Published By: HashtagU Telugu Desk
Naga Chaitanya Next Movie Director Fix

Naga Chaitanya Next Movie Director Fix

NC23 నాగ చైతన్య కస్టడీ రిజల్ట్ నిరాశపరచడంతో తను నెక్స్ట్ చేసే సినిమా టార్గెట్ అసలు మిస్ అవ్వకూడదని పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్తున్నాడు. ఈ క్రమంలో టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటితో నాగ చైతన్య సినిమా ఫిక్స్ చేసుకున్నారు. చైతన్య 23వ సినిమాగా రాబోతున్న ఈ మూవీ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాస్రు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా ఫిక్స్ అయిన విషయం తెలిసిందే.

పీరియాడికల్ డ్రామాగా ఫిషర్ మెన్ కథాంశంతో రాబోతుంది. ఇలాంటి కథాబలం ఉన్న సినిమాలకు సంగీతం చాలా ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఈ సినిమా మ్యూజిక్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారట. సినిమాకు అసలైతే అనిరుద్ తో మ్యూజిక్ చేయించాలని అనుకోగా అతను ఫుల్ బిజీగా ఉన్నాడని చెప్పగా మరో తమిళ మ్యూజిక్ కంపోజర్ సంతోష్ నారాయణన్ ని తీసుకున్నారని తెలుస్తుంది.

ఈ ఇయర్ నాని దసరా సినిమాకు సంతోష్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. ప్రస్తుతం వెంకటేష్ సైంధవ్ సినిమాకు కూడా సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పుడు నాగ చైతన్య NC23 సినిమాకు కూడా సంతోష్ మ్యూజిక్ అందిస్తున్నారని తెలుస్తుంది. ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయని టాక్.

నాగ చైతన్య చందు మొండేటి కలిసి ఇదివరకు ప్రేమ, సవ్యసాచి సినిమాలు చేశారు. ప్రేమం రీమేక్ సినిమా కాబట్టి హిట్ అందుకుంది. సవ్యసాచి మాత్రం అంచనాలను అందుకోలేదు. మరి ఈసారి వీరిద్దరు కలిసి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.

Also Read : Rashmika : సమంత ప్లేస్ లో రష్మిక.. గోల్డెన్ ఛాన్స్..!

  Last Updated: 25 Sep 2023, 05:52 PM IST