Site icon HashtagU Telugu

Naga Chaitanya : చైతు కోసం ‘మూడు’ సిద్ధం

Nagachaitnya24

Nagachaitnya24

నాగచైతన్య (Naga Chaitanya) ప్రస్తుతం తన కొత్త చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ‘తండేల్’ తర్వాత కార్తీక్ దండు (Karthik Dandu) దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభించారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం హైదరాబాదులో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో కీలక సన్నివేశాల కోసం రూ.5 కోట్ల వ్యయంతో ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఒక ప్రత్యేకమైన సెట్‌ను రూపొందించారు. ఇందులో సుమారు 20 నిమిషాల నిడివి గల కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

Liquor Rates Hike : కిక్ లేకుండా చేస్తావా అంటూ సీఎం రేవంత్ పై మందుబాబులు గరం గరం

ఈ సినిమా కథలో ట్రెజర్ హంట్ మరియు మైతలాజికల్ అంశాలు కలసి ఉంటాయి. ఇందులో ‘వృషకర్మ’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అయితే దీనితో పాటు మరో రెండు టైటిల్స్‌ను కూడా చిత్రబృందం పరిశీలిస్తోంది. దర్శకుడు కార్తీక్ దండు వెల్లడించిన మేరకు “మూడు టైటిల్స్‌పై పరిశీలన జరుగుతోంది. విరూపాక్ష లాంటి క్యాచీ టైటిల్ కావాలి. ఒకసారి ఫైనల్ అయితే, తక్షణమే పబ్లిక్‌లోకి దూసుకెళ్లేలా ఉండాలి” అన్నారు. కాబట్టి టైటిల్ ఎంపికపై జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.

ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా, ఆమె ఒక ఆర్కియాలజీ నిపుణురాలిగా కనిపించనున్నారు. నాగచైతన్య లుక్‌ ఈ సినిమాలో చాలా రిఫ్రెషింగ్‌గా ఉండబోతుందని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కి సుకుమార్ రైటింగ్స్ కూడా భాగస్వామిగా ఉంది. దర్శకుడు కార్తీక్ దండు సుకుమార్ శిష్యుడిగా పేరొందిన వ్యక్తి కావడంతో, ఈ సినిమాలో స్క్రీన్‌ప్లే విషయంలో సుకుమార్ స్పృహ స్పష్టంగా కనిపించనుంది. చైతన్య కెరీర్‌లో మరో విభిన్నమైన ప్రయోగాత్మక సినిమా అవుతుంది అని అంచనాలు ఉన్నాయి.