Site icon HashtagU Telugu

Naga Chaitanya : నా జీవితంలో ఏర్పడిన ఖాళీని తను నింపుతుంది.. శోభితతో పెళ్లిపై నాగచైతన్య..

Naga Chaitanya Interesting Comments on Marriage With Sobhita Dhulipala

Nagachaitanya

Naga Chaitanya : నాగచైతన్య, శోభిత(Sobhita) త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెల్సిందే. సమంతతో విడాకుల తర్వాత శోభితతో ప్రేమలో పడ్డ నాగచైతన్య ఈ ఆగస్టులో నిశ్చితార్థం చేసుకోగా ఇప్పటికే పెళ్లి పనులు మొదలుపెట్టారు. పెళ్ళికి ముందే శోభిత అత్తారింటి తరపున జరిగే ఈవెంట్స్ లో పాల్గొని సందడి చేస్తుంది. ఇటీవల గోవాలో జరిగినా ఐఫా వేడుకల్లో ఏఎన్నార్ 100వ జయంతిని నిర్వహించగా అక్కినేని ఫ్యామిలీ అంతా హాజరయింది.

అక్కడ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగచైతన్య తన పెళ్లి గురించి, శోభిత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య మాట్లాడుతూ.. మా పెళ్లి సింపుల్ గా, సాంప్రదాయంగా జరగనుంది. పెళ్లి పనులు జరుగుతున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ మా కుటుంబానికి చాలా ప్రత్యేకమైంది. అందుకే పెళ్లి అక్కడే జరగనుంది. స్టూడియోలో తాతయ్య గారి విగ్రహం ముందు మా పెళ్లి జరగనుంది. ఇరు కుటుంబ సభ్యులు ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాము. శోభితతో నేను బాగా కనెక్ట్ అయ్యాను. తను నన్ను ఎంతగానో అర్ధం చేసుకుంది. నా జీవితంలో ఏర్పడిన శూన్యాన్ని తను పూడుస్తుంది అని నమ్ముతున్నాను అని అన్నారు. శోభిత గురించి ఈ రేంజ్ లో చైతు పొగడటంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ఇక నాగచైతన్య – శోభిత పెళ్లి డిసెంబర్ 4 న అన్నపూర్ణ స్టూడియోస్ లో ఇరు కుటుంబ సభ్యులు, కొంతమంది బంధుమిత్రుల మధ్యే జరగనున్నట్టు నాగార్జున ఇటీవల తెలిపారు. ప్రస్తుతం నాగచైతన్య తండేల్ సినిమా కోసం వర్క్ చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది.

 

Also Read : Pushpa 2 Song : పుష్ప 2 ఐటెం సాంగ్ చూశారా..? శ్రీలీల అదరగొట్టేసిందిగా..