Naga Chaitanya : ఇంకా ఎన్ని రోజులు సాగదీస్తారు.. డైవర్స్ వార్తలపై, రూమర్స్ పై ఫైర్ అయినా నాగ చైతన్య..

చై, సామ్ విడాకుల గురించి ఏదో ఒక రూమర్, గాసిప్ వస్తూనే ఉంటుంది. మొదటిసారి నాగ చైతన్య ఈ రూమర్స్, గాసిప్స్ పై స్పందిస్తూ సీరియస్ అయ్యాడు.

Published By: HashtagU Telugu Desk
Naga Chaitanya fires on rumors and gossips about his divorce

Naga Chaitanya fires on rumors and gossips about his divorce

నాగ చైతన్య(Naga Chaitanya ), సమంత(Samantha) విడిపోయి సంవత్సరం పైనే అవుతున్నా ఇప్పటికి వారిపై వార్తలు అంటే హాట్ న్యూస్. వారు విడిపోయి ఎవరి సినిమాలు వాళ్ళు చేసుకుంటూ బిజీ లైఫ్ లో ఉన్నా సోషల్ మీడియాలో(Social Media) మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. చై, సామ్ విడాకుల గురించి ఏదో ఒక రూమర్, గాసిప్ వస్తూనే ఉంటుంది. ఇలాంటి వార్తలపై సమంత అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫైర్ అయినా చైతూ మాత్రం ఇప్పటివరకు కూడా వీటిపై స్పందించలేదు.

కానీ మొదటిసారి నాగ చైతన్య ఈ రూమర్స్, గాసిప్స్ పై స్పందిస్తూ సీరియస్ అయ్యాడు. నాగచైతన్య, కృతిశెట్టి జంటగా నటించిన కస్టడీ సినిమా మే 12న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న చైతూ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమంత గురించి, తమ విడాకుల గురించి వచ్చే రూమర్స్ పై స్పందించాడు.

నాగచైతన్య మాట్లాడుతూ.. నా సినిమాల గురించి ఎంత మాట్లాడినా, ఎంత విమర్శించినా ఓకే. కానీ నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నారు. ఈ విషయంలో కొంచెం బాధ అనిపిస్తుంది. మేమిద్దరం విడిపోయేటప్పుడు అధికారికంగా స్టేట్మెంట్స్ ఇచ్చాము. మాకు విడాకులు వచ్చి కూడా సంవత్సరం పైనే అవుతుంది. కానీ ఆ తర్వాత నుంచి సోషల్ మీడియాలో, బయట మా మీద వస్తున్న వార్తలు చూస్తుంటే బాధగా ఉంది, కోపంగా ఉంది. కనీసం వాళ్ళ ఫ్యామిలీలు బాధపడతాయి అని కూడా అనుకోరు. మా ఇద్దరితో పాటు వేరే వ్యక్తులని కూడా ఇందులోకి లాగి ఇష్టమొచ్చినట్టు రాస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు దీన్ని సాగదీస్తారు. ఇప్పటికైనా ఈ విషయాన్ని అందరూ వదిలేస్తారని అనుకుంటున్నాను అని అన్నాడు. దీంతో చైతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి ఇప్పటికైనా వీరిపై వచ్చే గాసిప్స్, రూమర్స్ ఆగుతాయేమో చూడాలి.

 

Also Read :  Naga Chaitanya: సమంత గురించి మొదటిసారి స్పందించిన నాగచైతన్య.. ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటూ?

  Last Updated: 10 May 2023, 08:36 PM IST