Site icon HashtagU Telugu

Naga Chaitanya : పాపం చైతు..సమంత & విజయ్ ని ఆలా చూసి ఎలా తట్టుకుంటున్నాడో..?

Chaitu Feeling

Chaitu Feeling

మనం ఎంతో ప్రేమిస్తున్న అమ్మాయి వేరే వ్యక్తి తో కాస్త చనువుగా మాట్లాడితేనే తట్టుకోలేం..అలాంటిది కొన్నేళ్లు ప్రేమించుకొని , ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకొని..కొంతకాలం పాటు సంసారం చేసి ఆ తర్వాత చిన్న చిన్న మనస్పర్థలుతో విడిపోయిన జంట ఎలా ఉంటారు..ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) కు , అభిమానులకు అలాంటి బాధే ఉంది.

నాగ చైతన్య – సమంతలు (Samantha) ఏమాయ చేసావే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వీరి మొదటి సినిమానే వీరిని ప్రేమలో పడేసింది. సినిమాల్లో ఎలాగైతే ఘాడంగా ప్రేమించుకున్నారో..ఒకర్ని వదిలి ఒకరు ఉండలేకపోయారో..నిజ జీవితంలో కూడా అలాగే ఉన్నారు. కొంతకాలం పాటు ఇద్దరు రహస్యంగా ప్రేమించుకున్నారు..నిజం ఏనాటికైనా బయటపడాల్సిందే కదా..వీరి ప్రేమ కూడా అలాగే బయటపడింది. ఇద్దరు కలిసి ఉన్న పిక్స్ , ఫారెన్ టూర్లలో కలిసి ఉన్న వీడియోస్ , పిక్స్ బయటకు వస్తూ వైరల్ గా మారాయి. కొంతకాలం వరకు మీము ఫ్రెండ్స్ మాత్రమే అంటూ చెప్పుకొని తిరిగిన చివరకు పెళ్లి చేసుకుంటున్నామని చెప్పి అభిమానుల్లో సంతోషం నింపారు.

ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి వారి సమక్షంలో ఎంతో గ్రాండ్ గా వివాహం (Naga Chaitanya – Samantha wedding) చేసుకున్నారు. అక్కినేని ఫ్యామిలీ లో సమంత అడుగుపెట్టడం ఆమెను ఒక్కసారిగా టాప్ స్థాయికి తీసుకెళ్లింది. సమాజంలో ఆమె గుర్తింపు పెరిగింది. ఇద్దరు హ్యాపీ గా ఉన్నారు. వీరి జంట చూసి చాలామంది కుల్లుకున్నారు కూడా. అంత బాగుందనుకుంటున్న సమయంలో ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. నాల్గు గోడల సమస్య కాస్త కోర్ట్ వరకు వెళ్ళింది. చివరకు ఇద్దరు విడాకులు (Naga chaitanya Samantha divorce) కావాలని నిర్ణయం తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత ఎవరి లైఫ్ లో వారు బిజీ అయ్యారు. చైతు వరుస సినిమాలతో బిజీ గా ఉంటె..సామ్ మాత్రం అనారోగ్యం (Samantha Health Problems) బారినపడి చావు అంచులవరకు వెళ్లి క్షేమంగా బయటపడింది.

ప్రస్తుతం అనారోగ్యంతోనే ఉన్నప్పటికీ ఒప్పుకున్నా సినిమాలు పూర్తి చేసి..ప్రస్తుతం రిస్ట్ తీసుకుంటుంది. తాజాగా ఈమె విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సరసన నటించిన ఖుషి మూవీ వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా తాలూకా సాంగ్స్ , ట్రైలర్ , స్టిల్స్ ఇలా ప్రతిదీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలోని పలు సీన్లు చూస్తే..మజిలీ సినిమా లోని చైతు , సామ్ గుర్తుకొస్తున్నారు. ఆలా కొన్ని సీన్లు ఉన్నాయి. చిత్ర ప్రమోషన్ లో భాగంగా మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో మ్యూజిక‌ల్ క‌న్సర్ట్ నిర్వ‌హించింది ఖుషి (Kushi) టైం. అట్టహాసంగా జ‌రిగిన ఈ వేడుక‌లో మ్యూజిక్ డైరెక్టర్ హేష‌మ్ అబ్దుల్.. సింగ‌ర్స్‌తో క‌లిసి చేసిన సంద‌డి ఒకెత్త‌యితే.. విజ‌య్, స‌మంత క‌లిసి స్టేజ్ మీద చేసిన హంగామా మ‌రో ఎత్తు.

ఆడియోలో సూప‌ర్ హిట్ట‌యిన ఖుషి టైటిల్ సాంగ్‌ను విజ‌య్, స‌మంత క‌లిసి స్టేజ్ మీద ఒక రేంజిలో పెర్ఫామ్ (vijay devarakonda samantha performance) చేశారు. ఈ సంద‌ర్భంగా వీరి కెమిస్ట్రీ చూసి చాలామంది అబ్బా అనుకున్నారు. అంతలా వీరిద్దరి జోడి అదిరిపోయింది. విజ‌య్ ముందుగా త‌న కోట్ తీసి ప‌క్క‌న ప‌డేసి.. స‌మంత‌ను ద‌గ్గ‌రికి తీసుకున్నాడు. త‌ర్వాత ఆమెను పైకెత్తుకుని తిప్పుతూ విన్యాసాలు చేశాడు. త‌ర్వాత ఇద్ద‌రూ క‌లిసి చేసిన రొమాంటిక్ విన్యాసాలు చేసారు.

ఈ విన్యాసాలు చూసి ..విజయ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తుంటే..నాగ చైతన్య ఫ్యాన్స్ మాత్రం కోపం , ఆక్రోశం తో చేతులు పీసుకుంటున్నారు. సామ్ పక్కన ఎప్పటికి చైతు ను ఆలా చూడాలనుకున్న వారు..విజయ్ తో సామ్ ను ఆలా చూసి తట్టుకోలేకపోతున్నారు. అభిమానులే ఇలా ఉంటె ప్రేమించి , పెళ్లి చేసుకున్న చైతు పరిస్థితి ఇంకెలా ఉంటుందో అని అంత మాట్లాడుకుంటున్నారు. ఎంత విడాకులు తీసుకున్న..మనసులో ఎక్కడో ఓ చోట మాత్రం బాధే ఉంటుంది. అది సమంత కైనా , నాగ చైతన్య కైనా..బయటకు ఆలా నవ్వుతున్నప్పటికీ..లోపల మాత్రం బాధే ఉంటుంది. మరి సినిమా లో ఇంకెన్ని ఇలాంటి సీన్లు ఉంటాయో చూడాలి.

Read Also : ShareChat : ట్విటర్ బాటలో షేర్ చాట్.. ట్విటర్ మాదిరిగానే షేర్ చాట్ కూడా బ్లూ టిక్ అమ్మకం