Site icon HashtagU Telugu

Naga Chaitanya: అమ్మా.. నాన్న.. నేను.. చైతూ ఎమోషనల్ పోస్ట్!

Nagachaitanya

Nagachaitanya

నాగచైతన్య తన తల్లి, తండ్రి నాగార్జున, హష్ కుక్కపిల్లకు థ్యాంక్స్ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. తన తదుపరి చిత్రం థాంక్యూ విడుదలవుతున్న సందర్భంలో ముఖ్యమైన వ్యక్తులను గుర్తుచేసుకుంటూ, వాళ్లకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశాడు. తన జీవితంలో తరచుగా వాడే పదం థ్యాంక్స్ అని, తాను ఎంతోమంది థ్యాంక్స్ చెబుతానని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఇక తన రాబోయే చిత్రంలో నాగ చైతన్య అభి అనే హాకీ స్టార్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో ప్రధాన హీరోయిన్లుగా అవికా గోర్, మాళవిక నాయర్, రాశి ఖన్నా కూడా నటించనున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దర్శకత్వంలో పి.సి.శ్రీరామ్ దర్శకత్వం వహించిన థాంక్యూ. దీనిని దిల్ రాజు నిర్మించారు.