Site icon HashtagU Telugu

Dhootha : నాగ చైతన్య దూత.. ప్రైం లిస్ట్ లో టాప్..!

Naga Chaitanya Dhootha Top Slot In Prime Video

Naga Chaitanya Dhootha Top Slot In Prime Video

Dhootha అక్కినేని నాగ చైతన్య లీడ్ రోల్ లో విక్రం కె కుమార్ డైరెక్షన్ లో వచ్చిన వెబ్ సీరీస్ దూత. శరత్ మరార్ నిర్మించిన ఈ వెబ్ సీరీస్ అమేజాన్ ప్రైం వీడియోస్ లో రిలీజ్ చేశారు. రీసెంట్ గా స్ట్రీమింగ్ అవుతున్న దూత సీరీస్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమాలో నాగ చైతన్య సాగర్ వర్మ పాత్రలో జర్నలిస్ట్ గా నటించారు. ఎనిమిది ఎపిసోడ్స్ తో వచ్చిన ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ వెబ్ సీరీస్ అక్కడక్కడ కాస్త స్లో అనిపించినా ఆడియన్స్ ని అలరిస్తుంది.

ప్రైం వీడియోస్ టాప్ స్లాట్స్ లో నాగ చైతన్య దూత నిలిచింది. ఈ సీరీస్ లో ప్రియా భవాని శంకర్, పార్వతి, ప్రాచీ దేశాయ్, పసుపతి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సీరీస్ కేవలం తెలుగులోనే కాదు సౌత్ అన్ని భాషలతో పాటుగా హిందీలో కూడా రిలీజైంది. నాగ చైతన్య కెరీర్ కు ఈ వెబ్ సీరీస్ మంచి బూస్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు.

బాలీవుడ్ లో ఆల్రెడీ లాల్ సింగ్ చద్దా సినిమా చేసిన నాగ చైతన్య దూత సీరీస్ తో మరోసారి అక్కడ ఆడియన్స్ ని అలరిస్తున్నాడు. దూత సీరీస్ కి మిక్సెడ్ రివ్యూస్ వచ్చినా ఓటీటీ ఆడియన్స్ మాత్రం సీరీస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాగ చైతన్య ఇక మీదట కూడా వెబ్ సీరీస్ లను కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఈ వెబ్ సీరీస్ కోసం నాగ చైతన్య 12 కోట్ల భారీ రెమ్యునరేషన్ అందుకున్నాడని తెలుస్తుంది. వెబ్ సీరీస్ సెకండ్ సీజన్ కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు దర్శకుడు విక్రం కె కుమార్.

Also Read : Nani : ఆ డైరెక్టర్ తో చేయాలని ఉందన్న నాని..!

We’re now on WhatsApp : Click to Join