Site icon HashtagU Telugu

Nagarjuna : నాగ్..ఇంకా సైలెంట్ గా ఉంటే ఎలా..?

Nagsilent

Nagsilent

కింగ్ నాగార్జున (Nagarjuna) పరిచయం అక్కర్లేని పేరు. సినిమాల్లోనేకాదు బిజినెస్ లోనే కింగే. అలాంటి కింగ్ ఇప్పుడు సైలెంట్ గా ఉండడం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. టాలీవుడ్ (Tollywood) లో సీనియర్ హీరోలు అంటే చిరంజీవి , బాలకృష్ణ, నాగార్జున , వెంకటేష్ అని ఎవరైన చెపుతారు. పేరుకు సీనియర్లు అయినా నాగ్ తప్ప మిగతా ముగ్గురు వరుస సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. చిరంజీవి విశ్వంభ‌ర‌ తో బిజీ గా ఉంటే, బాలయ్య వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ఇంకా వెంకీ కూడా రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కానీ నాగ్ నుండి మాత్రం ఓ సరైన హిట్ చూసి చాలాకాలమే అవుతుంది.

Rohit Sharma: భారీ రికార్డుపై కన్నేసిన హిట్ మ్యాన్

నాగార్జున ప్రస్తుతం శేఖర్ కమ్ముల ‘కుబేర’ మరియు రజనీకాంత్ ‘కూలీ’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే, ఈ రెండు సినిమాలు కూడా ఆయన సోలో హీరోగా చేసే సినిమాలు కావు. అంటే, ఈ సినిమాలు ఎంతటి విజయాన్ని సాధించినా, నాగ్‌ కెరీర్‌కు పెద్దగా లాభం ఉండదనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ఈ రెండు కాకుండా ఇప్పటి వరకు నాగార్జున కొత్త సినిమాలు అనౌన్స్ చేయలేదు. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. ఆయన కొత్త కథలు వినడంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదట. ఇప్పటికే టాలీవుడ్‌లో యంగ్ హీరోలు తాము వన్-మ్యాన్ షోలతో రాణించేందుకు ప్రయత్నిస్తుంటే, నాగ్ మాత్రం మల్టీ-స్టారర్ ప్రాజెక్టులకే పరిమితం కావడం అభిమానులకు నిరాశ కలిగిస్తోంది.

ఇప్పటికే చిరు, బాలయ్య, వెంకీలు తమ కెరీర్‌లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్‌ను ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఆ హీరోలను చూసైనా నాగ్ తన స్పీడ్ పెంచాలని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఒకసారి వరుసగా రెండు లేదా మూడు హిట్లు కొడితే, ఆయన కెరీర్ మళ్లీ పుంజుకునే అవకాశం ఉంటుంది. కానీ నాగ్ ఎందుకు ఆ ధోరణిలో ఆలోచించడం లేదు. కారణం ఏంటి అనేది ఎవ్వరికి అర్ధం కావడం లేదు. మరి త్వరలోనే ఓ కొత్త సినిమా ప్రకటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.