Megastar Chiranjeevi : చిరుతో నాగ్ అశ్విన్.. ఊహలకు కూడా అందని సినిమా..?

Megastar Chiranjeevi ప్రస్తుతం ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా ఎక్కడ విన్నా డైరెక్టర్ నాగ్ అశ్విన్ పేరు వినపడుతుంది. కల్కి 2898 ఏడితో అతను చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

Published By: HashtagU Telugu Desk
Chiranjeevi Donate

Chiranjeevi Donate

Megastar Chiranjeevi ప్రస్తుతం ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా ఎక్కడ విన్నా డైరెక్టర్ నాగ్ అశ్విన్ పేరు వినపడుతుంది. కల్కి 2898 ఏడితో అతను చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కల్కి సినిమా చూసిన తర్వాత రాజమౌళికి పోటీ ఇచ్చే డైరెక్టర్ వచ్చాడని అందరు ఫిక్స్ అయ్యారు. కల్కి మొదటి పార్ట్ అనుకున్నట్టుగానే సూపర్ హిట్ కాగా కల్కి 2 ఎలా ఉండబోతుంది అని ఆడియన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. ఇక మరోపక్క నాగ్ అశ్విన్ తో సినిమా చేయాలని స్టార్స్ కోరుతారు. అలాంటి ఒక క్రేజీ కాంబో సెట్ అయితే మరో లెవెల్ లో ఉంటుంది.

కల్కి 2 తర్వాత నాగ్ అశ్విన్ చిరుతో సినిమా చేయాలనే ప్లాన్ ఉందని టాక్. అది కల్కిని మించి ఉండబోతుందని అంటున్నారు. కల్కి సినిమాలో అశ్వద్ధామ పాత్రతో బిగ్ బి అమితాబ్ ని ఒక రేంజ్ లో చూపించాడు నాగ్ అశ్విన్. ఐతే అదే రేంజ్ లో చిరంజీవితో చేసే సినిమా కూడా ఒక రేంజ్ లో ఉంటుందని చెప్పొచ్చు. చిరుతో నాగ్ అశ్విన్ సినిమా అనగానే మెగా ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైట్ అవుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ తో సినిమా లైన్ లో ఉంది. అది పూర్తి కాగానే నాగ్ అశ్విన్ తో సినిమా చేసే ఛాన్సులు ఉన్నాయి. నాగ్ అశ్విన్ కుదిరితే కల్కి 2 లో కూడా చిరుని ఇన్వాల్వ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. కల్కి 2 లో మెగాస్టార్ చిరంజీవి ఉంటే ఆ సినిమా మరో లెవెల్ లో ఉంటుందని చెప్పొచ్చు.

Also Read : Tollywood : డిసెంబర్ సినిమాలకు రెడ్ అలర్ట్ తప్పదా..?

  Last Updated: 03 Jul 2024, 11:25 AM IST