Nag Ashwin : టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇప్పటివరకు తీసింది ముందే సినిమాలు. కానీ తన వర్క్ తో ఎంతో గుర్తింపుని సంపాదించుకున్నారు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’తో దర్శకుడిగా పరిచయమైన నాగ్ అశ్విన్.. ‘మహానటి’ సినిమాతో అందరి మనసులను గెలుచుకున్నారు. ఇక మూడో సినిమాగా ప్రభాస్ తో ‘కల్కి 2898 ఏడి’ వంటి ఫ్యూచరిస్టిక్ మూవీ తీసి అదుర్స్ అనిపించారు. అయితే ఇక్కడ ఫ్యూచరిస్టిక్ మూవీ తీయడం ఆశ్చర్యం కాదు, దానిని మన హిందూ మైథలాజితో లింక్ చేయడం గొప్ప విశేషం. గత నెల చివరిలో రిలీజైన ఈ చిత్రం రెండు వారాల్లోనే వెయ్యి కోట్ల మార్క్ ని అందుకుంది.
ఇక ఈ సంతోషంలో నాగ్ అశ్విన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ వేశారు. అదేంటంటే.. ”మా సినిమాలో గోరంగా రక్తపాతం సృష్టించలేదు, అలాగే రెచ్చగొట్టే సన్నివేశాలు కానీ, అశ్లీలత కానీ లేవు. అయినాసరి మేము వెయ్యి కోట్ల మార్క్ ని అందుకున్నాము” అంటూ నాగ్ అశ్విన్ కామెంట్ చేసారు. ఇక ఈ కామెంట్ చూసిన కొందరు నెటిజెన్స్.. నాగ్ అశ్విన్ ఇన్‌డైరెక్ట్ ఇతర దర్శకులను ట్రోల్ చేస్తున్నాడా అనే డౌట్స్ ని లేవనెత్తుతున్నారు. కొందరు నెటిజెన్స్ అయితే నాగ్ అశ్విన్ అన్న మాటల్ని సందీప్ రెడ్డి వంగకి ఆపాదిస్తున్నారు.
సందీప్ రెడ్డి తెరకెక్కించిన అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలు రెండు బ్లాక్ బస్టర్స్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ రెండు చిత్రాల్లో వైలెన్స్ అండ్ అశ్లీలత ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో చాలామంది సందీప్ వంగని క్వశ్చన్ చేస్తూ పలు కామెంట్స్ చేస్తుంటారు. ఇక ఇప్పుడు నాగ్ అశ్విన్ చేసిన కామెంట్స్ కూడా అలాగే ఉండడంతో.. వంగ ఫ్యాన్స్ నాగ్ అశ్విన్ పై ఫైర్ అవుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో నాగ్ అశ్విన్ అండ్ సందీప్ వంగ ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తుంది.