Site icon HashtagU Telugu

Project K: డియర్ మహీంద్రా సర్.. ప్లీజ్ హెల్ప్!

Project K

Project K

ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్‌ల స్టార్  కాస్ట్ తో ఓ రేంజ్ అంచనాలు ఉన్న సినిమాలలో ప్రాజెక్ట్ K ఒకటి. ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు. ‘సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌’గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. గత నెలలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అంతకుముందు దీపికా పదుకొణే ఈ సినిమా సెట్స్ లోకి అడుగుపెట్టి షూటింగ్ చేస్తోంది. తాజాగా నాగ్ అశ్విన్ భారతీయ బిలియనీర్, టెక్ ఔత్సాహికుడు ఆనంద్ మహీంద్రాతో సినిమా కోసం అతని సహకారాన్ని కోరాడు. ‘‘దేశంలో ఇంతకుముందు ఎవరూ తెరకెక్కించనివిధంగా సినిమా తీస్తున్నాం, ఇందుకోసం టెక్నాలజీతో పాటు ఇంజనీర్స్ అవసరమవుతారు. అత్యాధునిక విలువలతో రూపొందించే సినిమాకు మీ నుంచి కొంతైనా సాయం కావాలి’’ అంటూ ట్విట్టర్ వేదికగా రిక్వెస్ట్ చేశాడు. ఆనంద్ మహీంద్రా ఏదో విధంగా సహాయం చేస్తారని అభిమానులు కూడా ఆశిస్తున్నారు.

Exit mobile version