Nag Ashwin : డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇటీవలే కల్కి సినిమాతో 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి రికార్డ్ సాధించాడు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో మొదలుపెట్టి మహానటి, కల్కి.. మూడు సినిమాలతోనే స్టార్ డైరెక్టర్ హోదా తెచ్చుకున్నాడు. అయితే నాగ్ అశ్విన్ ఎంత ఎదిగినా, ఎన్ని అవార్డులు, రికార్డులు సాధించినా సింపుల్ గానే ఉంటాడు.
ఇటీవల కల్కి రిలీజ్ అయ్యాక తన పాత చెప్పులు ఫోటో పెట్టి కల్కి మొదలైనప్పటి నుంచి అవే వాడుతున్నాను అని పోస్ట్ చేసాడు. దీంతో నాగ్ అశ్విన్ మరీ ఇంత సింపుల్ గా ఉంటాడా అనుకున్నారు. తాజాగా నాగ్ అశ్విన్ తన కార్ ఫోటోని పోస్ట్ చేసాడు. మహానటి సినిమా నుంచి ఇప్పటిదాకా ఈ కార్ వాడుతున్నాను అని పోస్ట్ చేసాడు. అది మహీంద్రా E2O ప్లస్ కారు. ఎలక్ట్రిక్ వెహికల్ ఇది. ఈ కార్ ఫోటో పోస్ట్ చేసి ఈ కార్ కి మా ఇంటి సోలార్ ప్యానల్స్ నుంచే ఛార్జింగ్ ఇస్త్తున్నాను అని పోస్ట్ చేసాడు.
దీంతో నాగ్ అశ్విన్ పోస్ట్ వైరల్ అవుతుంది. మరోసారి నెటిజన్లు నాగ్ అశ్విన్ ని అభినందిస్తున్నారు. స్టార్ డైరెక్టర్, డబ్బున్న ఫ్యామిలీ అయి ఉండి ఏ పెద్ద కార్ వాడతావు అనుకుంటే నువ్వెంటి ఇంత సింపుల్ గా ఉన్నావు అని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : Devi Sri Prasad : పాపం దేవిశ్రీ ప్రసాద్.. ఫస్ట్ కాన్సర్ట్ తోనే విమర్శలు..