Site icon HashtagU Telugu

Nabha Natesh: పండుగ పూట పట్టు వస్త్రాల్లో పెళ్లికూతురులా ముస్తాబైన నభా నటేష్?

Nabha Natesh

Nabha Natesh

హీరోయిన్ నభా నటేష్ మనందరికీ సుపరిచితమే. ఈమె మొదట నన్ను దోచుకుందువటే అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయ్యింది. కాగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించిన విధంగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు అనుకున్న విధంగా గుర్తింపు దక్కలేదు. తెలుగుతో పాటు కన్నడ సినిమాలలో కూడా నటించి మెప్పించింది. తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ కి జోడిగా నటించింది.

We’re now on WhatsApp. Click to Join
ఈ సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకుంది. ఆ సినిమా మంచి హిట్ అవటంతో ఈ ముద్దుగుమ్మకీ వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. ఈ నేపథ్యంలోనే సోలో బ్రతుకే సో బెటర్, డిస్కో రాజా, అల్లుడు అదుర్స్ వంటి సినిమాలలో నటించినప్పటికీ ఆ సినిమాలు ప్లాప్ గా నిలిచాయి. దీంతో నెమ్మదిగా ఈమెకు పూర్తిగా అవకాశాలు కరువయ్యాయి. అయితే సినిమా అవకాశాలు లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తరచూ అభిమానులతో ముచ్చటిస్తూనే ఉంది.

Also Read: Vishwambhara: ఒక్క పోస్టుతో విశ్వంభర మూవీపై అంచనాలు పెంచిన డైరెక్టర్.. పోస్ట్ వైరల్!

బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్ లు షేర్ చేస్తూ యువతకు అందాలు కనువిందు చేస్తుంది.. కేవలం గ్లామర్ ఫోటోషూట్లు మాత్రమే కాకుండా పద్ధతిగా కూడా కనిపిస్తూ అందంతో రచ్చ రచ్చ చేస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఉగాది పండుగ సందర్భంగా ఈ ముద్దుగుమ్మ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలలో ఎంచక్క పద్ధతిగా పట్టుచీర కట్టుకొని ఒంటినిండా నగలు ధరించి పెళ్లికూతురులా ముస్తాబయింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలా బాగున్నావు, సో క్యూట్,సూపర్,ఆసమ్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు.

Also Read: Allu Arjun: వామ్మో.. అల్లు అర్జున్ కు ఏకంగా అన్ని కోట్ల ఆస్తి ఉందా?

Exit mobile version