Site icon HashtagU Telugu

Swayambhu : నిఖిల్ కూడా అదే బాటలో.. ‘స్వయంభు’ సినిమా కూడా..

Nabha Natesh, Nikhil Siddhartha, Swayambhu

Nabha Natesh, Nikhil Siddhartha, Swayambhu

Swayambhu : కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయిన నిఖిల్ సిద్దార్థ.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ని కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ హీరో సోషియో ఫాంటసీ నేపథ్యంలో ‘స్వయంభు’ అనే సినిమా చేస్తున్నారు. బాలకృష్ణ నటించిన ‘భైరవ ద్వీపం’ తరహాలో ఈ సినిమా కథ ఉండబోతుందట. ఈ సినిమాలో నిఖిల్ ఒక యుద్ధ వీరుడిగా కనిపించబోతున్నారు. ఇక నిఖిల్ కి జోడిగా నభా నటేష్, సంయుక్త నటిస్తున్నారు.

కాగా ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ‘డార్లింగ్’ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న నభా నటేష్.. ఈ సినిమా గురించిన ఓ ఇంటరెస్టింగ్ న్యూస్ ని లీక్ చేశారట. స్వయంభు సినిమా ఒక భాగంగా కాకుండా రెండు, మూడు భాగాలుగా రాబోతుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రెండు భాగాలుగా సినిమా రావడం చాలా కామన్ అయిపోయింది. కథని రెండు భాగాలుగా చెప్పడంతో.. ఆడియన్స్ కథకి బాగా కనెక్ట్ అవ్వడమే కాకుండా, సినిమా కలెక్షన్స్ కి బాగా ఉపయోగపడుతుంది. మరి స్వయంభు సినిమాతో నిఖిల్ ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తారో చూడాలి.

ఇక నిఖిల్ లైనప్ విషయానికి వస్తే.. ఈ సినిమా తరువాత ‘ది ఇండియా హౌస్’ మూవీ చేయబోతున్నారు. ఈ మూవీని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తుండడంతో పాటు, బ్రిటిష్ కాలంనాటి కథ ఆధారంగా తెరకెక్కుతుండడంతో పాన్ ఇండియా వైడ్ భారీ క్రేజ్ నెలకుంది. ఇటీవలే ఈ మూవీని పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేసారు. ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.