Site icon HashtagU Telugu

Naa Sami Ranga : నా సామిరంగ రిలీజ్ డేట్ ఫిక్స్..

Naasamiranga Release Date

Naasamiranga Release Date

కింగ్ నాగార్జున (Nagarjuna) , ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) జంటగా అల్లరి నరేష్ (Allari Naresh) , రాజ్ తరుణ్ (Raj Tarun) ప్రధాన పాత్రలో ఫేమస్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా చేస్తున్న మూవీ ‘నా సామిరంగ’. గత కొంతకాలంగా సరైన హిట్ లేని నాగ్..ఈ సినిమా ఫై గప్పెడు ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమా తాలూకా ట్రైలర్ , సాంగ్స్ , పోస్టర్స్ ప్రతిదీ సినిమా ఫై పాజిటివ్ బజ్ తీసుకొచ్చాయి.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు. మొన్నటి వరకు ఈ సినిమాను సంక్రాంతి బరిలో తీసుకరాబోతున్నారని అన్నారు కానీ డేట్ మాత్రం చెప్పలేదు. దీంతో అభిమానుల్లో సంక్రాంతికి వస్తుందో రాదో అనే సందేహాలు ఉండేవి..కానీ ఇప్పుడు ఆ సందేహాలను పటాపంచలు చేసారు. గతంలో సంక్రాంతి బరిలో ‘సోగ్గాడే చిన్ని నాయన’ మూవీ వచ్చి సూపర్ హిట్ సాధించింది. దీంతో ఇప్పుడు ‘నా సామిరంగ’ కూడా అదే విధంగా సూపర్ హిట్ కాబోతుందని అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమాను, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు బెజవాడ ప్రసన్నకుమార్ కథ, డైలాగ్స్ అందిస్తున్నాడు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Read Also : Salaar Collections : బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న సలార్