Naa Saami Ranga OTT : ‘నా సామిరంగ’ ఓటిటిలోకి వచ్చేస్తుందోచ్ ..

సంక్రాంతి బరిలో విడుదలైన చిత్రాలన్నీ ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే వెంకటేష్ నటించిన Saindhav మూవీ ఓటిటి రిలీజ్ డేట్ వచ్చేయగా..ఇప్పుడు నాగార్జున నటించిన నా సామిరంగ (Naa Saami Ranga) సైతం ఓటిటి రిలీజ్ డేట్ ప్రకటన వచ్చేసింది. ప్రస్తుతం ఓటిటి హావ నడుస్తున్న సంగతి తెలిసిందే. కరోనా సమయంలో థియేటర్స్ మూతపడడంతో సినీ లవర్స్ అంత ఓటిటి కి అలవాటు పడ్డారు. ఆ తర్వాత థియేటర్స్ ఓపెన్ అయినప్పటికీ , టికెట్స్ రేటు పెరగడం ..కరోనా […]

Published By: HashtagU Telugu Desk
Naa Saami Ranga

Naa Saami Ranga

సంక్రాంతి బరిలో విడుదలైన చిత్రాలన్నీ ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే వెంకటేష్ నటించిన Saindhav మూవీ ఓటిటి రిలీజ్ డేట్ వచ్చేయగా..ఇప్పుడు నాగార్జున నటించిన నా సామిరంగ (Naa Saami Ranga) సైతం ఓటిటి రిలీజ్ డేట్ ప్రకటన వచ్చేసింది. ప్రస్తుతం ఓటిటి హావ నడుస్తున్న సంగతి తెలిసిందే. కరోనా సమయంలో థియేటర్స్ మూతపడడంతో సినీ లవర్స్ అంత ఓటిటి కి అలవాటు పడ్డారు. ఆ తర్వాత థియేటర్స్ ఓపెన్ అయినప్పటికీ , టికెట్స్ రేటు పెరగడం ..కరోనా జాగ్రత్తల నడుమ థియేటర్స్ కు వెళ్లడం తగ్గించేశారు. ఇదే క్రమంలో ఓటిటి సంస్థలు నిర్మాతల వద్ద భారీ ధరలకు సినిమా ఓటిటి రైట్స్ కొనుగోలు చేయడం..విడుదలైన నెల రోజుల్లోనే స్ట్రీమింగ్ చేస్తామని చెప్పేయడం తో సినీ లవర్స్ సైతం ఓటిటి లో సినిమాలు చూసేందుకు ఇష్టపడుతున్నారు. పెద్ద హీరో , చిన్న హీరో అనే తేడాలేకుండా అన్ని సినిమాలు ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా సంక్రాంతి బరిలో వచ్చిన చిత్రాలు సైతం ఓటిటి లో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధం అయ్యాయి. గత కొద్దీ నెలలుగా హిట్ లేని కింగ్ నాగార్జున కు మరోసారి సంక్రాంతి కలిసొచ్చింది. గతంలో సంక్రాంతి కానుకగా వచ్చిన సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు మూవీస్ విజయం సాధించగా..ఈసారి సంక్రాంతిగా ‘నా సామిరంగ’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టాడు కింగ్. పక్కా పండగ మూవీగా అభిమానులను ఆకట్టుకుంటున్న ఈ మూవీ.. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టి హిట్ గా నిలిచింది.

కామెడీ, మాస్, లవ్ స్టోరీ ఇలా అన్ని అంశాల్లోనూ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందించింది . దీంతో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమిండ్ డేట్ కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఓటిటి రిలీజ్ డేట్ ప్రకటించి వారిలో ఆనందం నింపారు. ఫిబ్రవరి 15 నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అవుతున్నారట మేకర్స్. థియేటర్స్ లలో సందడి చేసిన నాగ్..ఇక ఇప్పుడు ఓటిటి లో సందడి చేయబోతున్నాడని కింగ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : e-Challan : వాహనదారులకు గుడ్ న్యూస్..పెండింగ్ చలాన్ల గడువు పెంపు

  Last Updated: 31 Jan 2024, 05:56 PM IST