Naa Saami Ranga: 32 కోట్లకు నా సామి రంగ నాన్ థియేట్రికల్ రైట్స్

టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన తాజా చిత్రం నా సామి రంగ. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తుండగా ఈ చిత్రాన్ని శ్రీనివాస్ చిట్టూరి నిర్మించారు.

Published By: HashtagU Telugu Desk
Naa Saami Ranga

Naa Saami Ranga

Naa Saami Ranga: టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన తాజా చిత్రం నా సామి రంగ. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తుండగా ఈ చిత్రాన్ని శ్రీనివాస్ చిట్టూరి నిర్మించారు. దీనికి ఆస్కార్ అవార్డ్ విన్నర్స్ కీరవాణి సంగీతం అందించగా, చంద్రబోస్ సాహిత్యం అందించారు.

సంక్రాంతికి వస్తున్నామని ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి చెబుతూనే ఉన్నారు. అయితే.. ఇంకా షూటింగ్ జరుపుకుంటుండడంతో పోటీ నుంచి తప్పుకుంటుంది అని ప్రచారం జరిగింది కానీ.. తగ్గేదేలే అన్నట్టుగా జనవరి 14న వస్తున్నట్టుగా ప్రకటించారు నాగ్. ఆతర్వాత నాన్ థియేట్రికల్ క్లోజ్ కాలేదు. సినిమా ప్రాబ్లమ్ అవుతుందని వార్తలు వచ్చాయి. అయితే.. ఈ సినిమా విషయంలో నాగార్జున రంగంలోకి దిగి నాన్ థియేట్రికల్ బిజినెస్ ని క్లోజ్ చేయించారట. ఇంతకీ విషయం ఏంటంటే.. మాటీవీతో నాగార్జునకు ఉన్న అనుబంధం గురించి తెలిసిందే.

ఆ అనుబంధం కారణంగానే నా సామి రంగ నాన్ థియేట్రికల్ రైట్స్ ను మా టీవీ 32 కోట్లకు సొంతం చేసుకుందట. ఈ సినిమాకి 45 కోట్లు బడ్జెట్ అయ్యింది. నాన్ థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్ అవ్వడంతో థియేటర్ల పై రావాల్సింది 13 కోట్లే అని టాక్ వినిపిస్తోంది. నాగార్జున సినిమాకి ఈమధ్య కాలంలో ఎన్నడూ రానంత బజ్ ఈ సినిమాకి వచ్చింది. దీంతో ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు నాగార్జున.

Also Read: KTR : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటు వేయాలో తెలిపిన కేటీఆర్‌

  Last Updated: 03 Jan 2024, 08:30 PM IST