Site icon HashtagU Telugu

Naa Saami Ranga : ‘నా సామిరంగ’ కు కలిసొచ్చిన కనుమ

Naasamiranga Release Date

Naasamiranga Release Date

గత కొద్దీ నెలలుగా హిట్ లేని కింగ్ నాగార్జున కు మరోసారి సంక్రాంతి కలిసొచ్చింది. గతంలో సంక్రాంతి కానుకగా వచ్చిన సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు మూవీస్ విజయం సాధించగా..ఈసారి సంక్రాంతిగా ‘నా సామిరంగ’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టాడు కింగ్. పక్కా పండగ మూవీగా అభిమానులను ఆకట్టుకుంటున్న ఈ మూవీ.. మూడు రోజుల్లోనే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కు చేరువైనట్లు మేకర్స్ వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join.

భోగి పండుగ అయిన జనవరి 14న ఈ సినిమా రిలీజ్ కాగా.. పండగ మూడు రోజులూ మంచి వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో రూ.24.8 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. వీటిని అధికారికంగా సినిమా ప్రొడ్యూసర్లే రివీల్ చేశారు. విజయ్ బిన్నీ డైరెక్ట్ చేసిన ఈ మూవీని శ్రీనివాస చిట్టూరి.. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మించాడు.

సంక్రాంతి బరిలో గుంటూరు కారం , హనుమాన్ , సైన్ధవ్ మూవీస్ సైతం విడుదలైనప్పటి, ప్రేక్షకులు మాత్రం హనుమాన్ మూవీ కే పెద్ద ఎత్తున పట్టం కట్టారు. ఈ సినిమాకు వెళ్లినవారు..దీనికి టికెట్స్ లేకపోవడం తో నెక్స్ట్ నా సామిరంగ మూవీకి వెళ్తున్నారు. మరికొంతమంది నేరుగా నా సామిరంగ మూవీ నే ఎంచుకుంటున్నారు. ఇలా మొత్తం మీద సంక్రాంతి బరిలో వచ్చిన నాగ్..మంచి హిట్ కొట్టాడు. ముఖ్యంగా కనుమ రోజు భారీ వసూళ్లు రాబట్టింది.

Read Also : PM Modi : మలయాళ నటుడు సురేష్ గోపి కూతురి వివాహానికి హాజరయిన ప్రధాని మోదీ..