Site icon HashtagU Telugu

Ashika Ranganath : ఆషిక వర్క అవుట్ వీడియో చూశారా..?

Na Samiranga Ashika Ranganath Workout Video

Na Samiranga Ashika Ranganath Workout Video

Ashika Ranganath అందంగా కనిపించేందుకు ఆడియన్స్ ని అలరించేందుకు హీరోయిన్స్ ఎంత కష్టపడతారు అన్నది మనం చూస్తూనే ఉంటాం. వారి ఫిజిక్ ని మెయింటైన్ చేయడానికి హీరోయిన్స్ పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇష్టమైనవన్నీ దూరం పెట్టి కష్టమైన జిం వర్క్ అవుట్స్ చేస్తూ తమ బ్యూటీని కొనసాగిస్తారు. వీరిలో తనేమి తక్కువ కాదని అంటుంది ఆషిక రంగనాథ్.

కింగ్ నాగార్జున నటించిన నా సామిరంగ సినిమాలో నటించిన ఆషిక రంగనాథ్ అంతకుముందు అమిగోస్ సినిమాలో చేసినా పెద్దగా ప్రభావం చూపించలేదు. లేటెస్ట్ గా నా సామిరంగ తో హిట్ అందుకున్న ఈ బ్యూటీ మంచి పాపులారిటీ సంపాదించింది. అంతేకాదు లేటెస్ట్ గా చిరంజీవి విశ్వంభర సినిమాలో కూడా అమ్మడు ఛాన్స్ పట్టేసింది.

చిరు సినిమాలో ఛాన్స్ రావడమే ఆలస్యం అమ్మడు జిం లో తెగ కష్టపడుతుంది. ప్రస్తుతం ఆషిక వర్క్ అవుట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వరాలుగా వయ్యారాలు పోయిన అమ్మడు ఇప్పుడు వర్క్ అవుట్స్ తో ఎంత కష్టపడుతుందో అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. చిరు విశ్వంభరలో అవకాశం తో అమ్మడు మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చింది.