Mamitha Baiju : ప్రేమలు హీరోయిన్ తో మైత్రి మూవీ మేకర్స్..!

రెండు మూడు కథలు విన్నా అవేవి నచ్చలేదని తెలుస్తుంది. ఫైనల్ గా మైత్రి మూవీ మేకర్స్ తో మమితా సినిమా ఫిక్స్ అయ్యిందట. ఈ సినిమాలో కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథ్

Published By: HashtagU Telugu Desk
Mytri Movie Makers Picks Premalu Mamitha Baiju

Mytri Movie Makers Picks Premalu Mamitha Baiju

మలయాళ భామ మమితా బైజు అంటే ఇప్పుడు యూత్ ఆడియన్స్ అంతా ఫిదా అవుతున్నారు. ప్రేమలు సినిమాతో అమ్మడు సౌత్ ఆడియన్స్ అందరినీ తన మాయలో పడేసుకుంది. ఆ సినిమా ముందు వరకు అసలు ఆమె పేరు కూడా తెలియని తెలుగు ఆడియన్స్ కూడా మమితా ప్రేమలో పడిపోయారు. ఆమె నెక్స్ట్ తెలుగు సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రేమలు సినిమాలో మమితా చేసిన పాత్ర ఇంప్రెస్ చేసింది. క్యూట్ లుక్స్ తో తన నటనతో ఆకట్టుకుంది.

ప్రేమలు తెలుగులో సక్సెస్ అవడానికి కూడా మమితా ఒక కారణం. ఐతే ప్రేమలు హీరోయిన్ మమితా (Mamitha Baiju) తెలుగులో ఇప్పటివరకు ఒక్క సినిమా ఓకే చేయలేదు. రెండు మూడు కథలు విన్నా అవేవి నచ్చలేదని తెలుస్తుంది. ఫైనల్ గా మైత్రి మూవీ మేకర్స్ తో మమితా సినిమా ఫిక్స్ అయ్యిందట. ఈ సినిమాలో కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథ్ నటిస్తాడని తెలుస్తుంది. లవ్ టుడే సినిమాతో డైరెక్టర్ కం హీరోగా సత్తా చాటిన ప్రదీప్ (Pradeep Ranganat) కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్నాడు.

అతన్ని హీరోగా పెట్టి మమితా బైజుని హీరోయిన్ గా తీసుకుని ఒక సూపర్ లవ్ స్టోరీ చేస్తున్నారని తెలుస్తుంది. ఆల్రెడీ కథా చర్చలు ముగిశాయని తెలుస్తుంది. సో మమితాను తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు మైత్రీ మేకర్స్. ఓ పక్క భారీ సినిమాలు చేస్తూనే లవ్ స్టోరీస్ చేయాలని ఈ ప్రొడక్షన్ సిద్ధమవుతుంది.

అదీగాక యూత్ లో సూపర్ ఫాలోయింగ్ ఉన్న మమితా లాంటి హీరోయిన్ ని లాక్ చేశారంటే కచ్చితంగా ఈ ప్రాజెక్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని చెప్పొచ్చు. మమితా బైజు తెలుగు స్ట్రైట్ సినిమా కోసం ఎదురుచూస్తున్న ఆమె ఫ్యాన్స్ కి ఇది హ్యాపీ న్యూస్ అని చెప్పొచ్చు.

Also Read : Thalapathi Vijay : విజయ్ సినిమాలో మరో స్టార్ హీరోయిన్.. ఎంతమంది కావాలి బాసు..!

  Last Updated: 25 Jul 2024, 08:09 AM IST