Site icon HashtagU Telugu

Thalapathy Vijay GOAT : మైత్రి చేతికి దళపతి సినిమా..!

Mytri Movie Makers Baught Thalapathy Vijay Goat Movie Telugu Rights

Mytri Movie Makers Baught Thalapathy Vijay Goat Movie Telugu Rights

మైత్రి మూవీ మేకర్స్ (Mytri Movie Makers) ఓ పక్క స్టార్ హీరోలతో క్రేజీ కాంబినేషన్స్ తో సినిమాలు నిర్మిస్తున్నారు. ఐతే వారు ఈమధ్య డిస్ట్రిబ్యూషన్ ని కూడా మొదలు పెట్టారు. మైత్రి మూవీ మేకర్స్ ఈమధ్య డబ్బింగ్ సినిమాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే వీరు రిలీజ్ చేసిన సినిమాలు మంచి ఫలితాలు రాబట్టాయి. ఇక లేటెస్ట్ గా కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ (Thalapathy Vijay) నటిస్తున్న జి.ఓ.ఏ.టి సినిమాను కూడా తెలుగు రిలీజ్ హక్కులు వీరు సొంతం చేసుకున్నారట.

వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న జి.ఓ.ఏ.టి (GOAT) సినిమాపై సూపర్ క్రేజ్ ఏర్పడింది. విజయ్ ఒక్కరు కాదు ఇద్దరు అనగా డ్యుయల్ రోల్ లో చేస్తున్న ఈ సినిమా పై పాన్ ఇండియా రేంజ్ లో బజ్ ఉంది. సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా త్రిష కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుంది. సినిమా తెలుగు రైట్స్ ని మైత్రి దక్కించుకుంది. తెలుగులో విజయ్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. అందుకు తగినట్టుగానే బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది.

విజయ్ జి.ఓ.ఏ.టి డైరెక్టర్ వెంకట్ ప్రభు (Venkat Prabhu) లాస్ట్ ఇయర్ నాగ చైతన్యతో కస్టడీ సినిమా చేశారు. ఆ సినిమా తమిళంలో పర్వాలేదు అనిపించుకుంది కానీ తెలుగులో పెద్దగా ఆడలేదు. ఇక ఇప్పుడు విజయ్ గోట్ తో తన సత్తా చాటాలని చూస్తున్నాడు వెంకట్ ప్రభు. మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ అంటే సినిమా కచ్చితంగా ఒక రేంజ్ లో ఉంటుంది.

కోలీవుడ్ లో వరుస హిట్లతో దూసుకెళ్తున్న విజయ్ గోట్ (Vijay GOAT) తో కూడా మరో సూపర్ హిట్ మీద కన్నేశాడు. మరి ఈ సినిమా ఆశించిన రేంజ్ లో ఉంటుందా లేదా అన్నది చూడాలి. తన ప్రతి సినిమా తెలుగులో ఐతే రిలీజ్ చేస్తాడు కానీ ఇక్కడ ప్రమోషన్స్ కి మాత్రం విజయ్ దూరంగా ఉంటాడు. మరి విజయ్ ఈసారైనా జి.ఓ.ఏ.టి ప్రమోషన్స్ కి తెలుగు రాష్ట్రాలకు వస్తాడా లేదా అన్నది చూడాలి.