Site icon HashtagU Telugu

Mytri Movie Makers : మైత్రి మూవీ మేకర్స్ కి అసిస్టెంట్ డైరెక్టర్స్ కావాలట.. మీకు ఈ క్వాలిటీస్ ఉంటే చాలు..!

Mytri Movie Makers Assistant Director Offers

Mytri Movie Makers Assistant Director Offers

Mytri Movie Makers మైత్రి మూవీ మేకర్స్ తెలుగులో అతి పెద్ద ప్రొడక్షన్ హౌస్. శ్రీమంతుడు సినిమా నుంచి వీరు నిర్మాణ సంస్థను మొదలు పెట్టగా భారీ సినిమాలు చేస్తూ హిట్లు సూపర్ హిట్లు కొడుతూ వస్తున్నారు. పుష్ప తో పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ అందుకున్న వీరు ఇప్పుడు పుష్ప 2 ని కూడా అదే రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు.

We’re now on WhatsApp : Click to Join

పుష్ప 2 తో పాటుగా చరణ్ 16వ సినిమా కూడా నిర్మిస్తున్న వీరు భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఇక త్వరలో భారీగా తెరకెక్కించే ఒక సినిమా కోసం ఈ నిర్మాణ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్స్ ని హైర్ చేసుకుంటుంది. మీకు తెలుగు, హిందీ భాషలో చదవడం రాయడం వస్తే ఈ ఛాన్స్ మీ కోసమే.

సినిమాలో ఎంట్రీ ఇవ్వాలని కలలు కనే వారికి ఇదొక సువర్ణావకాశం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసేందుకు అవకాశం ఇస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వారు వారు ఇచ్చిన మెయిల్ ఐడి teamblockbuster2024@gmail.comకు తమ బయోడేటా ఎక్స్ పీరియన్స్ ని మెయిల్ చేస్తే వారు కాంటాక్ట్ అవుతారు.

Also Read : Captain Miller Digital Release Date : నెలలోపే ఓటీటీలోకి కెప్టెన్ మిల్లర్.. డిజిటల్ రిలీజ్ డేట్ లాక్..!