Site icon HashtagU Telugu

Pushpa 2 : సినిమా బాగుంటే అన్ని బాగుంటాయ్..!

Mytri Makers Producer Ravi Shankar about Pushpa 2

Mytri Makers Producer Ravi Shankar about Pushpa 2

అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2 పై రకరకాల వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ పై మెగా ఫ్యాన్స్ విపరీతమైన నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. మెగా ఫ్యాన్స్ (Mega Fans) వర్సెస్ అల్లు ఫ్యాన్స్ అన్నట్టుగా సోషల్ మీడియాలో ఫైట్ తెలిసిందే. ఐతే ఈ గొడవల వల్ల పుష్ప 2 పై ఏమాత్రం ఇంపాక్ట్ పడుతుంది అన్నది అందరు చర్చిస్తున్నారు. కొందరు మెగా హార్డ్ కోర్ ఫ్యాన్స్ పుష్ప 2 ని మేము బాయ్ కాట్ చేస్తామని డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. ఐతే ఈ ఇష్యూపై ఇన్ డైరెక్ట్ గా స్పందించారు మైత్రి నిర్మాత రవి శంకర్ (Ravi Shankar).

సినిమా తప్పకుండా డిసెంబర్ 6న రిలీజ్ చేస్తామని.. బయట జరుగుతున్నది ఏది సినిమా మీద ఇంపాక్ట్ చూపదని. సినిమా బాగుంటే అన్ని బాగుంటాయని అన్నారు. అంటే ఆయన్ ఇన్ డైరెక్ట్ గా బాగున్న సినిమా ఎవరు ఏం చేసినా ఆడుతుందని చెప్పినట్టు తెలుస్తుంది. ఇక ఈసారి ఎట్టిపరిస్థితుల్లో డిసెంబర్ 6 రిలీజ్ (Release) మిస్ అవ్వదని అన్నారు.

డిసెంబర్ లో అయినా పుష్ప 2 (Pushpa 2) రిలీజ్ ఉంటుందా లేదా అన్న వార్తలు హడావిడి చేస్తుండగా సినిమా రిలీజ్ పై మరోసారి క్లారిటీ ఇచ్చారు నిర్మాత రవి శంకర్. సుకుమార్, అల్లు అర్జున్ ఇద్దరు తమ బెస్ట్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నారు. పుష్ప 1 తో నేషనల్ అవార్డ్ సైతం అందుకున్న అల్లు అర్జున్ పుష్ప 2 విషయంలో కూడా ఏమాత్రం రాజీ పడకుండా అదరగొట్టేయాలని ఫిక్స్ అయ్యాడు.

పుష్ప 2 గురించి తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు బీ టౌన్ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఉన్నారు. సినిమా విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బడ్జెట్ విషయంలో కూడా ఎక్కడ రాజీ పడట్లేదని తెలుస్తుంది.

Also Read : Saripoda Shanivara Collections : నాని సరిపోదా శనివారం నెక్స్ట్ లెవెల్ దూకుడు..!

Exit mobile version