Site icon HashtagU Telugu

Balakrishna : మైత్రీ నిర్మాణంలో బాలయ్య ఆ సినిమా రీమేక్ చేయబోతున్నాడా..?

Avesham, Nandamuri Balakrishna, Nbk109

Avesham, Nandamuri Balakrishna, Nbk109

Balakrishna : నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ప్రెజెంట్ మరో హిట్ అందుకునేందుకు NBK109ని సిద్ధం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే, మరో సూపర్ హిట్ సినిమాని కూడా రీమేక్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆ సినిమాని తెలుగు టాప్ ప్రొడక్షన్ కంపెనీ మైత్రీ మూవీ మేకర్స్.. హ్యాండిల్ చేయబోతున్నారని చెబుతున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటి..?

ఇటీవల మాలయంలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సినిమా ‘ఆవేశం’. ఫహాద్ ఫాజిల్ నటించిన ఈ చిత్రం యూత్ ఫుల్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందింది. ఈ సినిమాలో ముఖ్యంగా ఫహద్ ఫాజిల్ క్యారెక్టరైజేషన్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఇక ఈ మూవీని చూసిన కొందరు టాలీవుడ్ ఆడియన్స్.. తెలుగులో ఫహద్ ఫాజిల్ పాత్ర బాలయ్య బాబు చేస్తే బాగుంటుంది. ఆ చిత్రాన్ని రీమేక్ చేస్తే బాలయ్యతో చేయండి అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ కూడా చేసారు.

మరి ఆ ట్రెండ్‌ని, రిక్వెస్ట్‌ని మైత్రీ మూవీ మేకర్స్ గమనించారో ఏమోగానీ.. ఇప్పుడు ఆ చిత్రాన్ని రీమేక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారట. ఆడియన్స్ అడిగినట్లు ఫహద్ పాత్రకి బాలయ్యని తీసుకునే ప్రయత్నమే చేస్తున్నారట. ఈక్రమంలోనే బాలయ్యతో చర్చలు జరిపేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే.. ఈ మూవీని తెలుగులో ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు అనేది కూడా ఆసక్తిగా మారింది. అలాగే మూవీలో ప్రధాన పాత్రలు అయిన ముగ్గురు స్టూడెంట్స్ గా ఎవరిని తీసుకోబోతున్నారు అనేది కూడా చూడాలి.

ఇక ఈ వార్తలు చూసిన కొందరు తెలుగు ప్రేక్షకులు.. బాలయ్య ఒకవేళ ఈ సినిమాకి ఓకే చెప్పకపోతే, రవితేజతో చేయండి అంటూ కూడా సలహాలు ఇస్తున్నారు. మరి మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని ఎవరితో ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తారో చూడాలి.