Site icon HashtagU Telugu

Upasana Delivery: నా డెలివరీ ఇండియాలోనే.. రూమర్స్ పై ఉపాసన క్లారిటీ

ఆర్ఆర్ఆర్ సినిమాతో మెగా హీరో రాంచరణ్ (Ramcharan) గ్లోబల్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఆయన విదేశాల్లో సందడి చేస్తున్నాడు. ఒకవైపు ఆర్ఆర్ఆర్ విజయోత్సవం, సెలబ్రేషన్స్, అవార్డుల ప్రదానంలో బిజీగా ఉండగానే ఈ స్టార్ ఫాదర్ ప్రమోషన్ సైతం పొందాడు. అయితే రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని కొణిదెల (Upasana Konidela) గర్భం దాల్చిన విషయం తెలిసిందే. అయితే ఉపాసన తన మొదటి బిడ్డ అమెరికాలో పుట్టనుందనే పుకార్లు వినిపించాయి. తన బిడ్డ భారతదేశంలోనే పుడుతుందని ఉపాసన చెప్పింది. డిసెంబర్ 2022లో ఉపాసన (Upasana Konidela) గర్భవతి అనే వార్త బయటకు వచ్చింది.

అపోలో హాస్పిటల్స్‌లో CSR వైస్ ఛైర్‌పర్సన్ ఉపాసన తన బిడ్డకు ఇండియాలో జన్మనివ్వబోతుందని తెలిపింది.  అయితే రాంచరణ్ ఇటీవల ఆమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ జంట అక్కడే తమ మొదటి బిడ్డను యుఎస్‌లో పుట్టేందుకు ప్లాన్ చేసుకుంటున్నారనే వార్తలొచ్చాయి. అయితే తన డెలివరీ మాత్రం ఇండియాలోనే ఉంటుందని ఉపాసన ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసింది. ‘‘నా దేశం భారతదేశంలో నా మొదటి బిడ్డకు జన్మనివ్వడానికి నేను సంతోషిస్తున్నా’’ అంటూ ఉపాసన రియాక్ట్ (Upasana Konidela) అయ్యారు.

Also Read: Samantha Injured: యాక్షన్ సీన్స్ ఎఫెక్ట్.. సమంతకు గాయాలు!