Ponnambalam: నా తమ్ముడే నా పై విషం ప్రయోగం చేసాడు.. నటుడు పొన్నాంబలం సంచలన వ్యాఖ్యలు

నా తమ్ముడే నాకు విషం పెట్టి చంపాలనుకున్నాడని ప్రముఖ నటుడు పొన్నంబలం సంచలన ఆరోపణలు చేశాడు. ఆస్తి కోసం అయినవాళ్లే తనని ఇబ్బందిపెట్టారని పేర్నొన్నాడు.

నా తమ్ముడే నాకు విషం పెట్టి చంపాలనుకున్నాడని ప్రముఖ నటుడు పొన్నంబలం (Ponnambalam) సంచలన ఆరోపణలు చేశాడు. ఆస్తి కోసం అయినవాళ్లే తనని ఇబ్బందిపెట్టారని పేర్నొన్నాడు. కిడ్నీ సంబంధిత సమస్య నుంచి ఇటీవలే కోలుకున్న ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. తన ఆరోగ్యం, చిరంజీవి చేసిన సాయం సహా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

‘‘మద్యం తాగడం వల్లే నా కిడ్నీలు పాడైపోలేదు. అయినవాళ్లే నన్ను చంపాలని చూశారు. నా తండ్రికి నలుగురు భార్యలు. మూడో భార్య కుమారుడిని నా సొంత తమ్ముడిగా భావించి మేనేజర్‌గా పెట్టుకున్నా. నా వృత్తిపరమైన విషయాలన్నీ చూసుకునేవాడు. అతడిని ఎంతో నమ్మాను. ఓసారి నేను తాగే బీర్‌లో అతడు ‘స్లో పాయిజన్‌’ కలిపాడు. అంతటితో ఆగకుండా విషం కలిపిన ఆహారాన్ని పెట్టేవాడు. డబ్బు కోసం నాపై చేతబడి చేయించాడు. కొంతకాలానికి నా కిడ్నీలు దెబ్బతిన్నాయి. వైద్యుల్ని సంప్రదిస్తే విష ప్రయోగం జరగడం వల్లే ఇలా అయ్యిందని చెప్పారు’’ అంటూ తన తమ్ముడిపై పొన్నంబలం (Ponnambalam) ఆరోపణలు చేశాడు.

అలాంటి కష్ట సమయంలో చిరంజీవి (Chiranjeevi) చేసిన సాయాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘‘కిడ్నీ సమస్యతో ఇబ్బందిపడినప్పుడు చికిత్సకు అవసరమైన మొత్తం నా వద్ద లేదు. ఏం చేయాలో, ఎవరిని అడగాలో అర్థం కాలేదు. అలాంటి సమయంలో చిరంజీవి గుర్తుకువచ్చారు. ఆయనకు ఫోన్‌ చేసి నా సమస్య చెప్పి, సాయం చేయమని అడిగాను. నేనున్నానంటూ ఆయన భరోసానిచ్చారు. రూ.లక్ష లేదా రూ.రెండు లక్షలు పంపిస్తారనుకున్నా. కానీ, ఆయన.. ‘మరో ఐదు నిమిషాల్లో అపోలో ఆస్పత్రి నుంచి నీకు ఫోన్‌ వస్తుంది. రిపోర్ట్స్‌ తీసుకువెళ్లి అక్కడ జాయిన్‌ అవ్వు’ అని చెప్పారు. నేను ఎలాంటి ఫీజు చెల్లించలేదు. చికిత్సకు రూ.40 లక్షలు అయితే అంతా ఆయనే చూసుకున్నారు. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటా’’ అని పేర్కొన్నాడు. చికిత్స అనంతరం తన ఆరోగ్యం కాస్త మెరుగైందని వివరించాడు. తమిళనాడుకు చెందిన పొన్నంబలం (Ponnambalam) తెలుగులో ఎన్నో చిత్రాల్లో ప్రతినాయకుడిగా నటించాడు. ‘ఘరానా మొగుడు’, ‘అల్లరి ప్రియుడు’, ‘మెకానిక్‌ అల్లుడు’ వంటి సినిమాల్లో విలన్‌గా కనిపించి.. టాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందారు.

Also Read:  Rishi Sunak: మరోసారి వివాదంలో చిక్కుకున్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్..