Site icon HashtagU Telugu

Muttiah Muralitharan : శ్రీలంక మాజీ స్టార్ క్రికెటర్ బయోపిక్ ఇండియాలో.. ఫస్ట్ లుక్ పోస్టర్ చూశారా?

Muttiah Muralitharan Biopic Announced and First Look poster released

Muttiah Muralitharan Biopic Announced and First Look poster released

శ్రీలంక(Srilanka) మాజీ స్టార్ క్రికెటర్(Cricketer), ప్రపంచ స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్(Muttiah Muralitharan) తన ఆటతో ప్రపంచమంతటా అభిమానులని సంపాదించుకున్నాడు. ప్రపంచ క్రికెట్ లో తన బౌలింగ్(Bowling) తో సరికొత్త రికార్డులు సృష్టించాడు మురళీధరన్. టెస్టుల్లో ఏకంగా 800 వికెట్లు అత్యంత వేగంగా సాధించి ఎవ్వరూ సాధించలేని సరికొత్త రికార్డ్ సృష్టించాడు. వన్డేల్లో కూడా 500 లకు పైగా వికెట్స్ తీశాడు. శ్రీలంక క్రికెట్ విజయాల్లో మురళీధరన్ ముఖ్య పాత్ర పోషించాడు.

ముత్తయ్య మురళీధరన్ 2011 వరల్డ్ కప్ అనంతరం రిటైర్ అయ్యాడు. శ్రీలంక తమిళియన్ అయిన మురళీధరన్ కు మన తమిళనాడుతో సంబంధాలు ఉన్నాయి. గతంలోనే తమిళ ఇండస్ట్రీలో మురళీధరన్ బయోపిక్ తీస్తామని ప్రకటించారు. కానీ శ్రీలంక, తమిళుల మధ్య ఉన్న గొడవల కారణంతో పలువురు తమిళులు మురళీధర్ బయోపిక్ తీస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అందులో మురళీధరన్ గా విజయ సేతుపతి నటిస్తాడని ప్రకటించడంతో అతనికి కూడా హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఆ ప్రాజెక్టు అక్కడే ఆగిపోయింది.

చాలా సంవత్సరాల తర్వాత తాజాగా నేడు మురళీధరన్ పుట్టిన రోజు కావడంతో ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ప్రకటించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. తమిళ డైరెక్టర్ MS శ్రీపతి దర్శకత్వంలో బాలీవుడ్, ఇంగ్లీష్ నటుడు మధుర్ మిట్టల్ మురళీధరన్ పాత్రలో ఈ సినిమా 800 అనే టైటిల్ తో తెరకెక్కబోతోంది. టెస్టుల్లో 800 వికెట్లు తీసి ఎవరూ అందుకోలేని రికార్డుని మురళీధరన్ సెట్ చేయడంతో ఈ సినిమాకు 800 అనే టైటిల్ ని పెట్టారు.

తాజాగా నేడు ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. అన్ని కుదిరితే శ్రీలంకలో కూడా ఈ సినిమాని రిలీజ్ చేయాలని భావిస్తున్నారు చిత్రయూనిట్. మురళీధరన్ బయోపిక్ ఈ సంవత్సరం చివర్లో రానుంది. దీంతో క్రికెట్ ప్రేక్షకులు, మురళీధరన్ అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

 

Also read :   Ajaneesh Loknath : కాంతార సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తెలుగు సినిమాకు.. ఏ సినిమాకి సంగీతం ఇచ్చాడో తెలుసా??