Sirivennela : ఆయన “పదముద్రలు ” నా హార్మోనియం మెట్లపై నాట్యం చేశాయి!

చిరంజీవి మొదలుకొని రాంచరణ్ వరకు... వేటూరి నుంచి అనంత శ్రీరామ్..  ఎస్సీబీ నుంచి సునీత వరకు... ఇలా అన్ని తరాలవాళ్లతోనూ సిరివెన్నెల కు మంచి స్నేహం ఉంది. హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, నిర్మాతలు, జూనియర్ నటులు,

Published By: HashtagU Telugu Desk
Srivennla And Ilaraja

Srivennla And Ilaraja

చిరంజీవి మొదలుకొని రాంచరణ్ వరకు… వేటూరి నుంచి అనంత శ్రీరామ్..  ఎస్సీబీ నుంచి సునీత వరకు… ఇలా అన్ని తరాలవాళ్లతోనూ సిరివెన్నెల కు మంచి స్నేహం ఉంది. హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, నిర్మాతలు, జూనియర్ నటులు, అప్ కమింగ్ యాక్టర్స్.. సిరివెన్నెల కలం నుంచి జాలువారిన పాటలను ఇష్టపడినవాళ్లే. ముఖ్యంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు, సిరివెన్నెలకు ప్రత్యేక అనుభంధం ఉంది. సిరివెన్నెల దివికెగడంతో ఇళయ రాజా ఎమోషన్ అయ్యారు. ఆయన ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

‘‘వ్యాపారాత్మక సినిమా పాటల్లో సైతం.. కళాత్మకతని, కవితాత్మని అందించి..తనదైన ముద్రతో
అందమైన, అర్థవంతమైన,
సమర్థవంతమైన పాటలని
మన మెదళ్లలోకి జ్ఞానగంగలా ప్రవహింపచేసిన కవీశ్వరుడు సీతారాముడు..
ఎన్నో వత్సరాల ప్రయాణం మాది, శ్రీ వేటూరి గారికి సహాయకుడిగా వచ్చి…అతి తక్కువ కాలంలో..శిఖర స్థాయికి చేరుకున్న సరస్వతీ పుత్రుడు…
మా ఇద్దరి కలయికలో ఎన్నో పాటలు ప్రాణం పోసుకున్నాయి..తన పాటల “పదముద్రలు ” నా హార్మోనియం మెట్లపై నాట్యం చేశాయి… రుద్రవీణ, స్వర్ణకమలం, బొబ్బిలిరాజా
ఎన్ని సినిమాలు, ఎన్ని పాటలు…రేపు రాబోయే
” రంగమార్తాండ ” కూడా..
సీతారాముడు రాసిన పాటలకు నువ్వా నేనా అంటూ పోటీపడుతూ సంగీతాన్ని అందించిన సందర్భాలెన్నో…..!!
సీతారాముడు
పాటతో ప్రయాణం చేస్తాడు
పాటతో అంతర్యుద్ధం చేస్తాడు..
పాటలో అంతర్మథనం చెందుతాడు…
పాటని ప్రేమిస్తాడు..
పాటతో రమిస్తాడు..
పాటని శాసిస్తాడు..
పాటని పాలిస్తాడు.. పాట నిస్తాడు….
మన భావుకతకి భాషను అద్ది. మనకు తెల్సిన పాటలా చెవుల్లోకి ఒంపుతాడు… అందుకే
సీతారాముడి పాటలు ఎప్పటికీ గుర్తుంటాయి..
తన సాహిత్యం
నాతో ఆనంద తాండవం చేయించాయి
నాతో శివ తాండవం చేయించాయి..
“వేటూరి”
నాకు తెలుగు సాహిత్యం మీద ప్రేమను పెంచితే…
“సీతారాముడు”
నాకు తెలుగు సాహిత్యం మీద గౌరవాన్ని పెంచాడు..
ధన్యోస్మి మిత్రమా..!!
ఇంత త్వరగా సెలవంటూ
శివైక్యం చెందడం మనస్సుకు బాధగా ఉంది..
” పాటకోసమే బ్రతికావు,
బ్రతికినంత కాలం పాటలే రాసావు….
ఆ ఈశ్వరుడు నీకు సద్గతిని ప్రసాదించాలని కోరుకుంటున్న..’’

  Last Updated: 01 Dec 2021, 04:13 PM IST