ఇటీవల సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా టాలీవుడ్ లో ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూశారు. రాజ్ – కోటి ద్వయంలోని రాజ్(Music Director Raj)నేడు సాయంత్రం తన స్వగృహంలో గుండెపోటుతో మరణించారు.
ప్రళయ గర్జన సినిమాతో సినీ పరిశ్రమకు సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు రాజ్. ఆయన పూర్తి పేరు తోటకూర సోమరాజు. ఆయన తండ్రి టీవీ రాజు కూడా సంగీత దర్శకులే. మరో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తో కలిసి కొన్ని వందల సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఒకానొక సమయంలో రాజ్ – కోటి అంటే సూపర్ హిట్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచింది. రాజ్ సింగిల్ గా కూడా కొన్ని సినిమాలకు సంగీతం అందించారు.
కానీ కొన్నేళ్ల క్రితం రాజ్ – కోటి మనస్పర్థలు వచ్చి విడిపోయారు. రాజ్ – కోటిలు విడిపోయాక వారి సంగీత గ్రాఫ్ కూడా పడిపోయింది. వారు విడిపోయాక కలపాలని మెగాస్టార్, బాలసుబ్రహ్మణ్యం.. చాలామంది ట్రై చేశారు. కానీ వీరు కలవలేదు. రాజ్ చివరిసారిగా ఇటీవలే బేబీ సినిమాలోని ఓ సాంగ్ లాంచ్ కి విచ్చేశారు. దీంట్లో చాలా సంవత్సరాల తర్వాత కోటి పక్కన కూర్చొని కనిపించారు. ఇలా సడెన్ గా రాజ్ మరణించడంతో కోటి తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. ఇక పలువురు ప్రముఖులు. అభిమానులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
Also Read : Apsara Theatre: జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల అత్యుత్సాహం.. విజయవాడలోని అప్సర థియేటర్ లో మంటలు.. వీడియో వైరల్..!