GV Prakash : తమిళ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో GV ప్రకాష్ ఒకరు. సంగీత దర్శకుడిగా ఫుల్ ఫామ్ లో బిజీగా ఉంటూనే మరోవైపు నటుడిగా కూడా వరుస సినిమాలు చేస్తున్నాడు. GV ప్రకాష్ 2013లో సైంధవి(Saindhavi) అనే తమిళ సింగర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు ఒక కూతురు కూడా ఉంది. తాజాగా ఈ జంట విడిపోతున్నట్టు తమ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు.
GV ప్రకాష్ తమ సోషల్ మీడియాలలో.. నేను, సైంధవి.. పెళ్ళైన 11 ఏళ్ళ తర్వాత విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మా మానసిక ప్రశాంతత కోసం ఒకరిమీద ఒకరం గౌరవంతో, అర్ధం చేసుకొని విడిపోతున్నాము. మీడియా, ఫ్రెండ్స్, ఫ్యాన్స్.. ఈ విషయంలో మా ప్రైవసీకి భంగం కలిగించరని కోరుకుంటున్నాను. ఇది మేము తీసుకున్న బెస్ట్ నిర్ణయం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మీరు తోడుగా ఉంటారని ఆశిస్తున్నాను అని పోస్ట్ చేసారు.
సైంధవి కూడా ఇదే విధంగా పోస్ట్ చేసింది. దీంతో ఈ విషయం వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. త్వరలోనే విడాకులకు అధికారికంగా అప్లై చేస్తారని సమాచారం.
Also Read : Kalki 2898 AD : ‘కల్కి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేట్ ఫిక్స్ అయ్యిందట.. ఎప్పుడంటే..?